Chiranjeevi Balakrishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పట్లో చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ సినిమాలకు పోటా పోటీ ఉండేది. ఇద్దరు హీరోల అభిమానులు కూడా తమ అభిమాన హీరోల సినిమాలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునేవారు. థియేటర్ వద్ద పండుగ వాతావరణం క్రియేట్ చేసే వారు. బ్యానర్లు కట్టడం మొదలు కొని థియేటర్ లో ఫస్ట్ షో పడేవరకు… అభిమానుల రచ్చ మామూలుగా ఉండేది కాదు. సినిమా హిట్ పడింది అంటే ఇంకా సదరు హీరోల అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు.
ఆ రీతిగా నందమూరి వర్సెస్ మెగా అభిమానులు వార్ ఉండేది. ఒకేసారి చిరంజీవి బాలకృష్ణ సినిమాలు రిలీజ్ అవుతుంది అంటే ఇంకా అభిమానుల మధ్య యుద్ధవాతావరణం కనబడేది. ఎవరు ఎక్కడ తగ్గే పరిస్థితి ఉండేది కాదు. అప్పట్లో ఇంద్ర వర్సెస్ చెన్నకేశవరెడ్డి, మృగరాజు వర్సెస్ నరసింహ నాయుడు… ఇంకా చాలా సినిమాలు ఒకే రోజు విడుదల అయిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఒకసారి బాలకృష్ణ సినిమా సాధిస్తే మరోసారి చిరంజీవి సినిమా పైచేయి సాధించేది. ఇద్దరూ కూడా ఎక్కడా తగ్గే వారు కాదు. అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ మహేష్ తరం రావడంతో… కొద్దిగా చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ సినిమా పోటీ వాతావరణం చల్లబడింది. ఆ తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళి పోవడం తెలిసిందే.
మళ్లీ ఇటీవల సినిమా ఇండస్ట్రీ లోకి రీఎంట్రీ ఇవ్వడంతో.. వరుసపెట్టి సినిమాలు చేస్తున్న చిరంజీవి ఈసారి బాలకృష్ణ తో పోటీకి దిగడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళ్తే చిరంజీవి డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో నటిస్తున్న గాడ్ ఫాదర్ దసరాకి రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ రెడీ కావడం జరిగింది అంట. ఇదే సమయంలో బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న సినిమా కూడా దసరాకి విడుదల కాబోతుంది అని అంటున్నారు. దీంతో ఈ దసరాకి చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద పోటాపోటీ పడటానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి విదేశీ యాత్ర లో ఉన్నారు. త్వరలో ఇండియా కి చేరుకుని జూన్ మొదటి వారం నుండి.. గాడ్ ఫాదర్ షూటింగ్ లో పాల్గొని ఏకధాటిగా సినిమాని కంప్లీట్ చేయనున్నట్లు సమాచారం. మరోపక్క బాలయ్యబాబు.. కూడా గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. సో మొత్తమ్మీద బాలయ్య బాబు చిరంజీవి సినిమాలు చాలా కాలం తర్వాత దసరాకి పోటీ పడటానికి రెడీ అవుతున్నట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వినపడుతోంది.
Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…
Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…
Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…
Radhika Apte Balakrishna: హీరోయిన్ రాధిక ఆప్టే(Radhika Apte) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎటువంటి పాత్రలు చేయడానికైనా హద్దులు…
YCP Plenary: వచ్చే నెల 8,9 తేదీల్లో నిర్వహించబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా…
Suriya: తమిళ నటుడు హీరో సూర్య(Suriya)గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దక్షిణాది సినీ ప్రేమికులకి హీరో సూర్య సుపరిచితుడే. వైవిధ్యమైన…