NewsOrbit
Entertainment News సినిమా

Dasara: చిరంజీవి, బాలకృష్ణ సినిమాల కలెక్షన్స్ దాటేసిన “దసరా”..!!

Share

Dasara: నిన్న శ్రీరామనవమి పండుగ సందర్భంగా విడుదలైన నాని సినిమా దసరా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో “జెర్సీ” సినిమా కంటే ఈ సినిమాతో మరింత పేరు వస్తుందని చెప్పిన నాని ఆ రీతిగానే విజయాన్ని అందుకున్నారు. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు తీసిన ఈ సినిమా.. థియేటర్లలో సందడి చేస్తోంది. సినిమా అన్ని రకాలుగా బాగుండటంతో అన్ని వర్గాల ప్రేక్షకులు థియేటర్లకు తండోపతండాలుగా వెళ్తున్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటిరోజు దేశవ్యాప్తంగా ₹38 కోట్లు కలెక్ట్ చేసినట్లు చిత్ర యూనిట్ తెలియజేయడం జరిగింది.

Chiranjeevi and Balakrishna's movie collections have surpassed Dasara

ఇదే కంటిన్యూ అయితే వీకెండ్ అయ్యేలోపు ₹100కోట్ల క్లబ్ లో చోటు తగ్గించుకోవడం ఖాయమని సినిమా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ప్రారంభంలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చిరంజీవి నటించిన “వాల్తేరు వీరయ్య”, బాలయ్య నటించిన “వీర సింహారెడ్డి” పోటీ పడటం తెలిసిందే. ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాల కలెక్షన్స్ నాని నటించిన దసరా దాటేయటం జరిగింది. విషయంలోకి వెళ్తే “దసరా” సినిమా రిలీజ్ అయ్యి ఇది రెండో రోజు.

Chiranjeevi and Balakrishna's movie collections have surpassed Dasara

అయితే ఈ ఏడాది నైజాంలో తొలి రోజే ఎక్కువ కలెక్షన్స్ సాధించిన సినిమాగా “దసరా” మొదటి ప్లేస్ లో నిలిచింది. విషయంలోకి వెళ్తే మొదటి రోజు ఈ సినిమాకి ₹6.78 కోట్లు రాగా రెండో స్థానంలో బాలయ్య బాబు.. “వీర సింహారెడ్డి” ₹6.21కోట్లు.. ఆ తర్వాత చిరంజీవి “వాల్తేరు వీరయ్య” ₹6.10కోట్లు నిలిచాయి. “దసరా” అద్భుతమైన టాక్ సంపాదించడంతో సోషల్ మీడియాలో నాని సంచలన పోస్ట్ పెట్టారు. “జెర్సీ” సినిమాలో ట్రైన్ పక్కన ఆనందంతో అరిచే ఫోటోకి రెండు చేతిలో గోడ్డలు.. పెట్టిన ఫోటో పోస్ట్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


Share

Related posts

Bigg Boss Ott Telugu: బిగ్‏బాస్ ఇంటిని చూపించిన నాగార్జున.. వీడియో అదిరిందిగా!

kavya N

Sarkaru Vaari Paata: మహేశ్‌ను వేడుకుంటున్న ఫ్యాన్స్..మేలో రిలీజ్ చేస్తే ఫ్లాపని ఎందుకు ఫిక్సైయ్యారు..?

GRK

బ్రేకింగ్: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళికి కరోనా పాజిటివ్

Vihari