Mega 154: నేడు దీపావళి పండుగ సందర్భంగా మెగాపాకీ దర్శకత్వం చిరంజీవి నటించిన సినిమా టీజర్ రిలీజ్ చేశారు. “మెగా 154” వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా “వాల్తేరు వీరయ్య” గా థియేటర్లలో వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు సందడి చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. టీజర్ లో చిరంజీవి ఫుల్ మాస్ పాత్ర చేసినట్లు తెలుస్తోంది. కాస్ట్యూమ్స్ కూడా చాలా రొటీన్ కి భిన్నంగా ఉన్నాయి. ముఠామేస్త్రి సినిమాలో నోట్లో బీడీ పెట్టుకుని ఏ రీతిగా అప్పట్లో ఉండే వాళ్ళు అదే తరహాలో.. చిరంజీవి లుక్ ఉంది. పైగా వెరైటీగా చెవికి పోగు పెట్టుకుని.. బీడీ కాలుస్తూ అదిరిపోయే డైలాగ్ కూడా టీజర్ లో చిరంజీవి తెలియజేశారు.
పూర్తి ఎంటర్టైన్మెంట్ తరహాలో ఈ సినిమా ఉండనున్నట్లు టీజర్ బట్టి అర్థమవుతుంది. బాంబుతో విలన్లను పేల్చి ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ధమాకా పూర్తిగా చూడాలనుకుంటే లైక్, షేర్, సబ్స్క్రయిబ్ చెయ్యండి అంటూ చిరంజీవి మాస్ స్లాంగ్ లో చెప్పిన డైలాగ్ టీజర్ లో హైలెట్ గా నిలిచింది. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా కీలక పాత్ర పోషించడం తెలిసిందే. అయితే ఈ టీజర్ చివరిలో రవితేజ వాయిస్ తో దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. “హ్యాపీ దీపావళి తొందరలోనే కలుద్దాం” అని వాయిస్ ఇవ్వడం జరిగింది.
చిరంజీవి సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్నా ఈ సినిమా పూర్తి వినోదాత్మకంగా ఉంటుందని ఇటీవల “గాడ్ ఫాదర్” సక్సెస్ మీట్ లలో తెలియజేయడం జరిగింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అన్నయ్య సినిమా తర్వాత లాంగ్ లెన్త్ లో చిరంజీవి పక్కన రవితేజ చాలా కాలం తర్వాత ఈ సినిమాలో నటిస్తూ ఉండటంతో అటు రవితేజ ఇటు మెగా అభిమానులు సినిమాపై భార్య అంచనాలు పెట్టుకోవడం జరిగింది.