HBD Allu Arjun: “గంగోత్రి”మూవీతో సినిమా ఎంట్రీ ఇచ్చిన బన్నీ .. విభిన్నమైన చిత్రాలు చేస్తూ తనకంటూ సెపరేట్ ఇమేజ్ అభిమానుల్లో సంపాదించుకోవడం తెలిసిందే. మెగా హీరోలలో తనకంటూ సెపరేట్ గుర్తింపు పొందిన అల్లు అర్జున్… సినిమా సినిమాకి మేక్ఓవర్ మారుస్తూ నటనలో కూడా వైవిధ్యం చూపిస్తూ.. స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. “పుష్ప” సినిమాతో దేశ విదేశాలలో సైతం తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న బన్నీ… నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాలలో అభిమానులు భారీ ఎత్తున… బన్నీ జన్మదిన వేడుకలు చేస్తున్నారు.
కేరళలో కూడా అల్లు అర్జున్ కి తెలుగులో మాదిరిగా ఫాలోయింగ్ ఉండటంతో… మలయాళం కుర్రకారు కూడా మల్లు అర్జున్ జన్మదిన వేడుకలు ఘనంగా చేస్తున్నారు. పుష్ప సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తనకంటూ మార్కెట్ ఫస్ట్ సినిమాతోనే బన్నీ క్రియేట్ చేసుకోవడం విశేషం. పుష్పాల్లో బన్నీ మేనరిజం పలికిన డైలాగులు వేసిన స్టెప్పులు.. ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఇటువంటి తరుణంలో బండి పుట్టినరోజు సందర్భంగా నార్త్ ఇండియా ప్రేక్షకులు కూడా విషెస్ తెలియజేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియా ద్వారా స్పెషల్ విషెస్ తెలియజేశారు. హ్యాపీ బర్తడే బన్నీ. నీ దృష్టి… కష్టపడే విధానం నీకు విజయాన్ని తీసుకొస్తున్నాయి. ఈ పుట్టినరోజు వేడుకలను ఎప్పుడు గుర్తుండిపోయేలా జరుపుకో… అంటూ చిరంజీవి ట్వీటర్ లో ట్వీట్ చేశారు. ఇంకా ఇండస్ట్రీ నుండి డైరెక్టర్ బాబీ, రామజోగయ్య శాస్త్రి, డైరెక్టర్ నాగ వంశీ, హీరోయిన్ రష్మిక మందన, యాంకర్ అనసూయ, కోన వెంకట్, బండ్ల గణేష్, విక్టరీ వెంకటేష్, ఆది పినిశెట్టి, సాయి ధరమ్ తేజ్.. అల్లు అర్జున్ కి సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.