God Father: మెగాస్టార్ చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో చేస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మలయాళం లూసిఫర్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీలకమైన పాత్రలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ లో సల్మాన్ పాల్గొనడం తెలిసిందే. ముంబైలో జరిగిన షూటింగ్ లో చిరంజీవి, సల్మాన్ పలు కీలక సన్నివేశాలలో నటించడం జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే ఈ సినిమాలో ఇద్దరూ కలిసి ఒక స్పెషల్ సాంగ్ చేయబోతున్నారట. ఈ పాటకి ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్పెషల్ బాణీలు కూడా ఇవ్వటం జరిగింది అంట. దీంతో జూన్ నెల మొదటి వారంలో ఈ స్పెషల్ సాంగ్ కి సంబంధించి షూటింగ్ స్టార్ట్ కానుందట. ఈ సాంగ్ కి ప్రభుదేవా కొరియోగ్రాఫర్ అందించనున్నారు. ప్రస్తుతం చిరంజీవి విదేశీ యాత్ర లో ఉన్న సంగతి తెలిసిందే. విదేశీ యాత్రలు ముగించుకున్న వెంటనే గాడ్ ఫాదర్ షూటింగ్ లో సాంగ్ తో షెడ్యూల్ మొదలు పెట్టనున్నట్లు ఇండస్ట్రీ లో టాక్ నడుస్తుంది.
సల్మాన్ ఖాన్ నటిస్తుండటంతో ఈ సినిమా హిందీలో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేయటానికి సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెల పాత్రలో హీరోయిన్ నయనతార నటిస్తున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. జూన్ మొదటి వారంలో.. ప్రభుదేవా ఆధ్వర్యంలో చిరంజీవి సల్మాన్ “గాడ్ ఫాదర్” సినిమాకి సంబంధించి స్పెషల్ సాంగ్ షూట్ చేయనున్నట్లు సమాచారం.