NewsOrbit
Entertainment News సినిమా

Bhola Shankar: “మే” డే నాడు టాక్సీ డ్రైవర్ గా చిరంజీవి “భోళా శంకర్” స్పెషల్ పోస్టర్..!!

Share

Bhola Shankar: నేడు “మే” డే సందర్భంగా మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న “భోళా శంకర్” సినిమాకి సంబంధించిన రెండు స్పెషల్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. టాక్సీ డ్రైవర్ గా చిరంజీవి లుక్ ఉంది. పసుపు కలర్ ట్యాక్సీ పై వంకాయ కలర్ డ్రెస్ లో చిరంజీవి స్టిల్ అదరగొట్టింది. “కార్మికులు, కర్షకులు, శ్రమజీవులకు అందరికీ మే డే శుభాకాంక్షలు. ఆగస్టు 11 వ తారీకు “భోళాశంకర్” థియేటర్ లలో రిలీజ్ కానుంది” అని చిరంజీవి పోస్టర్లను రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. చిరంజీవి చెల్లెల పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది.

Chiranjeevi Bhola Shankar special poster on "May" day

తమిళంలో “వేదాళం” సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో… భారీ సెంటిమెంట్ సీన్స్ ఉండనున్నట్లు సమాచారం. తమిళంలో అజిత్ నటించిన ఈ సినిమా భారీ విజయం సాధించింది. అయితే తెలుగు నేటివిటీకి అనుగుణంగా…స్టోరీలో కొద్దిగా మార్పులు చేర్పులు చేసి… సరికొత్తగా మెహర్ రమేష్ ఆవిష్కరించడం జరిగిందట. ఇదిలా ఉంటే “భోళాశంకర్” సినిమాపై మెగా ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఎందుకంటే ఈ సినిమా డైరెక్టర్ మెహర్ రమేష్… ట్రాక్ రికార్డు గతంలో చూస్తే హిట్ కొట్టి కొన్ని దశాబ్దాలు అయ్యాయి. మరి అటువంటి దర్శకుడుని చిరంజీవి ఏ రకంగా నమ్మి ఈ ప్రాజెక్టు చేశాడు అన్నది పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Chiranjeevi Bhola Shankar special poster on "May" day

మరోపక్క చిరంజీవి గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య రెండు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలు తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు మూడో సినిమా “భోళాశంకర్”తో హ్యాట్రిక్ కొడతాడా లేదా అన్నది… సందేహంగా మారింది. వాస్తవానికి ఏ సినిమా వేసవికాలంలో రిలీజ్ అవుతుందని అందరు అనుకున్నారు. దాదాపు షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. కానీ వాల్తేరు వేరే సంక్రాంతికి రావటంతో మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇవ్వాలని ఆగస్టు నెలలో… విడుదల చేయాలని చిరంజీవి ప్లాన్ చేసి… 11వ తారీకు రిలీజ్ చేస్తున్నారట. చిరంజీవి మరియు కీర్తి సురేష్ మధ్య వచ్చే సీన్స్ సినిమా మొత్తానికి హైలైట్ గా ఉండబోతున్నాయట.


Share

Related posts

Venkatesh: మెగా హీరోతో వెంకీ మలయాళ మల్టీస్టారర్..వీరిలో ఎవరు..!

GRK

`లైగ‌ర్‌`లో విజ‌య్ దేవ‌ర‌కొండ క‌న్నా అత‌డికే రెమ్యున‌రేష‌న్ ఎక్కువ‌ట‌!?

kavya N

Uppena : ఉప్పెన బుచ్చిబాబు కి ఛాన్స్ ఇచ్చిన ఎన్టీఆర్.. మైత్రీ మూవీస్ లో నిర్మాణం..?

GRK