మెగా వారి పెళ్లి సందడి అంబరాన్ని అంటుతుంది. పెళ్లికి ముందు జరుగుతున్న కార్యక్రమాలలో కుటుంబ సభ్యుల హడావుడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా చిరంజీవి కుటుంబం సభ్యులు ఈ వేడుకలలో సెంటర్ అఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. నిహారిక సంబంధించిన అన్ని కార్యక్రమాలు పెద్దలు చిరంజీవి దంపతులు పాల్గొంటున్నారు. బుధవారం నిహారిక కొణెదల.. జొన్నలగడ్డ చైతన్య మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు. నాగబాబు తన గారాలపట్టి చూసి మురిసిపోతున్నారు. రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలెస్ లో నిహారిక వివాహం జరగబోతుంది. ఈ వేడుక కోసం ప్యాలెస్ ను సుందరంగా ముస్తాబు చేశారు. పవన్ కళ్యాణ్ కూడా ఉదయపూర్‌కి చేరుకున్నారు. ఫ్రీ వెడ్డింగ్ వేడుకలలో కుటుంబ సభ్యులు ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. మంగళవారం జరిగిన సంగీత పార్టీలో కాబోయే భర్త చైతన్యతో కలిసి అలా నిహరిక చూసి అందరికి రెండుకళ్ళూ చాలలేదు.
అయితే ఈ వేడుకలు మెగాస్టార్ చిరంజీవి కూడా ఉల్లాసంగా గడుపుతున్నారు. చిన్నప్పటి నుంచి తన కూతుళ్ళలా నిహారికను కూడా సొంత కూతురిలా చూసుకున్న మెగాస్టార్ నిహరికకు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. పెళ్ళి కూతుర్ని చేసిన సమయంలో ఆ ఖరీదైన బహుమతిని ఇచ్చారట. ఆ బహుమతి విలువ దాదాపు రెండు కోట్ల రూపాయలు ఉంటుందట. నిహరిక కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన
ఆ ఆభరణాన్ని భార్య సురేఖతో కలిసి నిహారికకు అందించారు. ఇనాళ్ళు నిహరిక మీద ఉన్న ప్రేమను ఇలా కాస్ట్లీ గిప్ట్‌తో చాటుకున్నారు. నిహారిక పెళ్లి వేడుకల్లో రామ్ చరణ్, అల్లు అర్జున్ సందడి చేస్తున్నారు. కాబోయే దంపతులు నిహారిక, చైతన్య జొన్నలగడ్డను రామ్ చరణ్, ఉపాసన ఆశీర్వదించారు.నిహారిక,చైతన్య జొన్నలగడ్డ 9వ తారీఖున రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మిథుల లగ్నంలో ఒక్కటికాబోతున్నారు. ఈ వేడక కోసం అభిమానులు అత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!