సినిమా ఇండస్ట్రీకి స్టూడియోలు చాలా కీలకం. ఔట్ డోర్ షూటింగ్ తప్పించి ఇండోర్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టూడియోల్లోనే జరుగుతున్నాయి. తెలుగు సినిమాకు సంబంధించి సారధి, పద్మాలయా, అన్నపూర్ణ, రామానాయుడు, రామోజీ ఫిలిం సిటీ.. ఎన్నో రకాలుగా ఉపయోగపడ్డాయి. ‘స్క్రిప్ట్ తో లోపలికి వెళ్లి బాక్సులతో బయటకు రావచ్చు’ అని రామోజీ ఫిలింసీటీకి పేరు. దేశంలోని ఇతర భాషల సినిమాల షూటింగ్స్ కూడా ఆర్ఎఫ్ సీలో జరుగుతున్నాయి. ఇప్పుడీ రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి కూడా అడుగుపెడుతున్నారనే వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో స్టూడియో నిర్మాణానికి మెగస్టార్ ఆసక్తి చూపిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఆయనకు అక్కడున్న పదెకరాల స్థలంలో స్టూడియో నిర్మిస్తారని ప్రచారం జరుగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ మాదిరిగా ఇందులో షూటింగ్ ఫ్లోర్లు, కాటేజీలు, రిలాక్స్ అయ్యేందుకు క్యాబిన్ లు నిర్మిస్తారని అంటున్నారు. ఇండోర్ షూటింగ్స్, సీరియల్స్, రియాలిటీ షోస్, మినీ ఈవెంట్స్ జరపుకునే వీలుగా స్టూడియో నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో బాగా వైరల్ అయింది. దీనిపై మెగా ఫ్యామిలీ నుంచి అఫిషియల్ న్యూస్ రావాల్సి ఉంది. ఇటివలే అల్లు అరవింద్ గండిపేట సమీపంలో అల్లు స్టూడియోస్ నిర్మాణాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
చిరంజీవికి స్టూడియో నిర్మించాలనే ఆలోచన రెండు దశాబ్దాల క్రితమే వుంది. అప్పట్లోనే దీనిపై వార్తలు వచ్చాయి. అల్లు అరవింద్–చిరంజీవి స్టూడియో నిర్మాణంపై చర్చలు జరిపారని.. స్థలం కోసం అన్వేషణ కూడా జరిగిందని అప్పట్లో వార్తలు ప్రముఖంగా వచ్చాయి. అయితే.. ఆ వార్తలు వాస్తవ రూపం దాల్చలేదు. వైజాగ్ లో స్టూడియో నిర్మించేందుకు చిరంజీవి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఇటివల వార్తలు వచ్చాయి. ఆ వార్తలు కూడా ఆగిపోయాయి. ఇప్పుడు హైదరాబాద్ లోనే స్టూడియో నిర్మిస్తున్నట్టు గాసిప్స్ రౌండ్ అవుతున్నాయి. మరి.. ఈసారైనా స్టూడియో నిర్మాణం వార్తల్ని మెగాస్టార్ నిజం చేస్తారో లేదో చూడాలి.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!