NewsOrbit
Entertainment News సినిమా

Chiranjeevi Khaidi: నా జీవితంలో గొప్ప టర్నింగ్ పాయింట్ అంటూ “ఖైదీ” సినిమా పై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్..!!

Share

Chiranjeevi Khaidi: మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో “ఖైదీ” సినిమా ఒక ప్రత్యేకం. ఈ సినిమాయే చిరంజీవికి మాస్ ఇమేజ్ తీసుకురావడం జరిగింది. 1978వ సంవత్సరంలో చిరంజీవి “పునాదిరాళ్లు” సినిమాతో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. మధ్యలో చాలా సినిమాలు చేసినా గానీ “ఖైదీ” సినిమా చిరంజీవికి.. మంచి ఇమేజ్ తెచ్చి పెట్టింది. ఈ సినిమాలో చిరంజీవి డ్యాన్స్ మరియు డైలాగులు ఇంకా ఫైట్స్ అప్పట్లో హైలైట్ గా నిలిచాయి. “ఖైదీ” ముందు వరకు చిరంజీవి ఇమేజ్ ఒక ఎత్తు అయితే “ఖైదీ” తర్వాత.. తిరుగులేని ఇమేజ్ అని చెప్పవచ్చు.

Chiranjeevi emotional post on the movie Khaidi saying it was the greatest turning point in my life

ఆ టైంలో బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులను సృష్టించడం జరిగింది. అప్పట్లోనే ఈ సినిమా ఎనిమిది కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం జరిగింది. ఈ సినిమాతోనే చిరంజీవికి స్టార్ హీరో ఇమేజ్ రావటం జరిగింది. అంతేకాదు “ఖైదీ” తోనే కోదండరామిరెడ్డి చిరంజీవి కాంబినేషన్ సినిమాలు స్టార్ట్ అయ్యాయి. 1983 అక్టోబర్ 28వ తారీకు విడుదలైన ఈ సినిమా నేటికీ 40 సంవత్సరాలు కావటంతో చిరంజీవి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘ఖైదీ సినిమా నలభై ఏళ్ళు పూర్తి చేసుకుంది. ”ఈ చిత్రం నిజంగానే అభిమానుల గుండెల్లో నన్ను శాశ్వత ‘ఖైదీ’ని చేసింది. నా జీవితంలో ఓ గొప్ప టర్నింగ్ పాయింట్ ఆ చిత్రం ! ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మరువలేనిది.

Chiranjeevi emotional post on the movie Khaidi saying it was the greatest turning point in my life

“ఖైదీ” విడుదలై నేటికి 40 సంవత్సరాలయిన సందర్భంగా ఒక సారి ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ , ఆ చిత్ర దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి గారిని, నిర్మాతలు సంయుక్తా మూవీస్ టీమ్‌ని, రచయితలు పరుచూరి సోదరులను, నాకో- స్టార్స్ సుమలత, మాధవిలని మొత్తం టీమ్‌ని అభినందిస్తూ, అంత గొప్ప విజయాన్ని మాకందించిన తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు అంటూ” చిరు ట్విట్ట‌ర్‌లో రాసుకోచ్చాడు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ వైర‌ల్‌గా మారింది. కాగా ప్రస్తుతం చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో కొత్త సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ప్రస్తుతం చిరంజీవి ఇటలీలో ఉన్నారు. నాగబాబు తనయుడు మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి వేడుకకి హాజరు కావడం జరిగింది.


Share

Related posts

మాధవ్ ను సారు అని పిలిచినా దేవి.. నిద్రలో కలవరిస్తూన్న బిడ్డను చూసి బాధపడుతున్న రాధ..

bharani jella

Chiranjeevi: “అల‌య్ బ‌ల‌య్” కార్యక్రమంలో చిరంజీవిపై అసహనం వ్యక్తం చేసిన గరికపాటి..!!

sekhar

`గాడ్ ఫాద‌ర్‌` ఫ‌స్ట్ వీక్ క‌లెక్షన్స్‌.. చిరు రాబ‌ట్టాల్సింది ఇంకా చాలా ఉంది!

kavya N