Chiranjeevi: 2011వ సంవత్సరంలో ఎస్.జె.సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన “కొమరం పులి” అట్టర్ ఫ్లాప్ కావడం తెలిసిందే. అప్పటికే వరుస ప్లాపులతో ఉన్న పవన్ కళ్యాణ్… “ఖుషి” డైరెక్టర్ సూర్యతో సినిమా చేయడంతో “కొమరం పులి” సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ఫస్ట్ టైం కెరియర్ లో… పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కనిపించేసరికి .. సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. కనీసం అంచనాలను అందుకోలేక మొదటిలోనే సినిమా చతికిలపడింది. పవన్ కళ్యాణ్ లుక్ కొత్త గా ఉన్నారని “కొమరం పులి” అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇదే సమయంలో సినిమాలో పవన్ సరసన నిఖిషా పటేల్ హీరోయిన్ గా చేయటం తెలిసిందే.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ సినిమా తర్వాత కొద్ది పాటి అవకాశాలు వచ్చినా గాని.. తర్వాత పెద్దగా రాణించలేక పోయింది. ఇటువంటి తరుణంలో సోషల్ మీడియాలో ఇటీవల అభిమానులతో చిట్ చాట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. చిరంజీవి కి సంబంధించిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానంతో.. చిరు అభిమానులు ఆవేశానికి గురి అయింది. మేటర్ లోకి వెళ్తే ఇండస్ట్రీలో హీరోల గురించి ఒక్కమాటలో చెప్పాలంటే అని అభిమానులు ప్రశ్నించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ తరుణంలో మహేష్ బాబు అనేసరికి ఫెయిర్ అండ్ లవ్లీ, ప్రభాస్ అనేసరికి మంచి ఫ్రెండ్ తో పాటు నాకంటే పొడుగు ఎక్కువ, పవన్ అనే సరికి గడ్డం లుక్ బాగుంటుంది.. ఇక మెగాస్టార్ అన్న పార్టీకి ఆయన ఎవరు అండి నికిషా పటేల్ అనటంతో ఒక్కసారిగా చిరు ఫ్యాన్స్ మండి పడుతున్నారు. మెగాస్టార్ లు చాలామంది ఉంటారని మీరు అడిగిన వ్యక్తి ఎవరు అని ప్రశ్నించింది. దీంతో చిరు ఫ్యాన్స్ వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి అని..సీరియస్ అయ్యారు. ఇదే టైములో గతంలో నికిషా పటేల్.. చిరంజీవికి సంబంధించి సోషల్ మీడియాలో మెగాస్టార్ అనే కామెంట్ తో చేసిన పోస్టులను బయటపెట్టి… దుమ్మెత్తిపోస్తున్నారు. మెగా అభిమానుల నుండి ఈ విషయానికి సంబంధించి నికిషా పటేల్ పై భారీ ఎత్తున విమర్శలు వస్తున్నాయి.