NewsOrbit
సినిమా

Chiranjeevi: కాజ‌ల్ ఉండుంటే ఈ ప‌రిస్థితి వ‌చ్చేదా చిరు.. నెటిజ‌న్లు సెటైర్లు!

Advertisements
Share

Chiranjeevi: కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవి న‌టించిన తాజా చిత్రం `ఆచార్య‌`. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ల‌పై నిరంజ‌న్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ `సిద్ధ‌` అనే ఓ కీల‌క పాత్ర‌ను పోషించారు. దాదాపు న‌ల‌బై నిమిషాల పాటు ఈయ‌న పాత్ర తెర‌పై క‌నిపించ‌బోతోంది.

Advertisements

దేవాలయ భూముల ఆక్రమణకి సంబంధించిన సామాజిక అంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. గ‌త ఏడాదే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 29న గ్రాండ్‌గా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగానే మంగ‌ళ వారం సాయంత్రం చిరంజీవి, చ‌ర‌ణ్‌, పూజా హెగ్డే మ‌రియు కొర‌టాల శివ‌లు హైదరాబాద్ లో ప్రత్యేకంగా మీడియా సమావేశాన్ని నిర్వహించారు.

Advertisements

ఈ మీడియా ఇంట్రాక్ట్‌లో వారు సినిమా గురించి ఎన్నో విశేషాల‌ను పంచుకున్నారు. అలాగే రిపోర్ట‌ర్లు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు త‌మ‌దైన శైలిలో స‌మాధానాలు ఇచ్చారు. అయితే ఈ ప్రెస్ మీట్ అనంత‌రం అక్క‌డ ఉన్న కెమెరామెన్స్‌ బృందం ఫోటోలు తీసేందుకు ముందుకు రాగా.. చిత్ర టీమ్ వారికి పోజులిచ్చారు. అయితే ఈ క్ర‌మంలోనే స్టేజ్ పై చిరు కొంటె చేష్టలు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశారు. అస‌లేం జ‌రిగిందంటే.. చరణ్, పూజా, చిరంజీవిలు ఫొటోలకు గ్రూపుగా పోజులిచ్చారు.

 

మరోసారి ఫొటోలకు పోజులివ్వమని ఫొటోగ్రాఫర్స్ పిలిస్తుండ‌గా.. పూజా హెగ్డే వినిపించుకోకుండా వెళ్లిపోతుంటుంది. దాంతో చిరు ఆమెని వెనక్కి లాగారు. ఇంతలో చరణ్ కూడా వస్తుండటంతో నువ్వు వద్దు, వెన‌క్కి వెళ్ల‌మ‌ని సైగ చేసి.. పూజాతో మాత్ర‌మే ఫొటోలకు పోజులిచ్చారు. అంతేకాదు, పూజాను తన రెండు చేతులతో బంధించే ప్రయత్నం చేసిన చిరు.. మ‌ళ్లీ బాగాదులే అంటూ వెన‌క్కి త‌గ్గారు

ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోలో చిరు చిలిపి త‌నానికి కొంద‌రు ఫిదా అవుతుంటే.. మ‌రికొంద‌రు నెటిజ‌న్లు `కాజ‌ల్ ఉండుంటే పూజాతో ఫొటోలు దిగే ప‌రిస్థితి వ‌చ్చేదా చిరు` అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో చిరుకు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌, చ‌ర‌ణ్ కోసం పూజాల‌ను హీరోయిన్లుగా ఎంపిక చేశారు. కానీ, కాజ‌ల్ పాత్ర‌కు ఈ సినిమాలో ప్రాధాన్య‌త లేక‌పోవ‌డంతో.. కొర‌టాల ఆమె పాత్ర‌ను తీసేశారు. దీంతో చిరు హీరోయిన్ లేకుండానే ఆచార్య చేశారు.


Share
Advertisements

Related posts

Kushboo: భవిష్యత్ సినిమాల విషయంలో సరికొత్త స్టేట్మెంట్ ఇచ్చిన ఖుష్బూ..!!

sekhar

లుంగీలో కీర్తి సురేష్ ఊర‌మాస్ స్టెప్పులు.. వీడియో వైర‌ల్‌!

kavya N

Sunitha: రామ్ వీరపనేని పిల్లలకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే ఆశ్చర్య పోతారు!!

Naina