GodFather: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ “ఇస్మార్ట్ శంకర్” సినిమాతో పరాజయల నుండి బయటపడినా గాని “లైగర్” రూపంలో మరో ఫ్లాప్ రావటం పెద్ద మైనస్ గా మారింది. దీంతో విజయ్ దేవరకొండతో చేస్తున్న “జనగణమన” షూటింగ్ ఆగిపోవడం జరిగింది. ఇటువంటి తరుణంలో పూరి తన తర్వాత సినిమా ఎవరితో చేస్తారు అన్నది ఇంకా సస్పెన్స్ గానే నెలకొంది. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన “గాడ్ ఫాదర్” లో పూరి జగన్నాథ్ చిన్నపాటి జర్నలిస్టు రోల్ చేయటం తెలిసిందే. “గాడ్ ఫాదర్” సినిమాకి సంబంధించి ప్రధాన కథని నడిపించే రీతిలో పూరి జగన్నాథ్ వాయిస్.. మరియు నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఫస్ట్ టైం పూరి జగన్నాథ్ నటనపరంగా కూడా మంచి మార్కులు కొట్టేశారు. పూరీలో దర్శకుడు మాత్రమే కాదు మంచి యాక్టర్ కూడా ఉన్నారని..”గాడ్ ఫాదర్” చూసిన జనాలు అంటున్నారు. సినిమా మంచి విజయం సాధించటంతో మెగా ఫాన్స్ ఫుల్లు సంబరాలు చేసుకుంటున్నారు. మరోపక్క సినిమా యూనిట్ .. సక్సెస్ మీట్ లు నిర్వహిస్తూ ఉంది. ఈ క్రమంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి .. డైరెక్టర్ పూరి జగన్నాథ్ జూమ్ ద్వారా లైవ్ ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఇద్దరూ కూడా సినిమా గురించి అనేక విషయాలు మాట్లాడుకున్నారు. అయితే ఈ ఇంటర్వ్యూలో భాగంగా.. డైరెక్టర్ పూరీకి మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే బంపర్ ఆఫర్ ఇచ్చారు.
పూర్తి విషయంలోకి వెళ్తే ఏదైనా కథ ఉంటే కచ్చితంగా నీతో చేస్తాను పూరి అని లైవ్ లో చిరంజీవి అడగటం జరిగింది. అంతేకాదు గతంలో తనకి చెప్పిన “ఆటో జానీ” స్క్రిప్ట్ ఏమైందని కూడా పూరి జగన్నాథ్ ని ప్రశ్నించారు. ఈ క్రమంలో పూరి జగన్నాథ్.. ఆ స్క్రిప్ట్ పక్కన పెట్టేసాను సార్. దానికంటే మంచి కాన్సెప్ట్ స్టోరీతో మీ ముందుకు వస్తాను అంటూ ఇంటర్వ్యూలో పూరి చెప్పడం జరిగింది. దీంతో చిరంజీవి.. కచ్చితంగా రాబోయే రోజుల్లో ఇద్దరం కలిసి మంచి సినిమా చేద్దామంటూ తెలియజేశారు. దీంతో వరుస పరాజయాలలో ఉన్న పూరి జగన్నాథ్ కి కచ్చితంగా ఇది పెద్ద అవకాశం అని.. సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.