Chiranjeevi: సాధారణంగా మనము తమిళ, మలయాళ భాషలలో సినిమాలను చూస్తే ఎక్కువగా పంచె కట్టులో హీరోలు మనకు కనిపిస్తారు. ఈ విధంగా పంచెకట్టులో ఎంతో మంది హీరోలు ఎన్నో సినిమాలలో సందడి చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.తమిళంలో ఎంతో విజయవంతమైన సినిమాలను తెలుగులో రీమేక్ చేసినప్పటికీ మన హీరోలు మాత్రం పంచె కట్టుకు దూరంగా ఉంటూ, జీన్స్ ప్యాంట్ లలో దర్శనమిస్తారు. పంచె ధరించడం మన తెలుగు సంప్రదాయం అయినప్పటికీ, మనవారు పంచె కట్టుకు దూరంగా ఉంటారు. కానీ మొట్టమొదటిసారిగా మన తెలుగు హీరో మెగాస్టార్ సినిమా మొత్తం పంచె కట్టులోనే మనకు దర్శనమివ్వనున్నారు.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా తరువాత చిరంజీవి మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న “లూసిఫర్” చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారు. అయితే ఈ సినిమాలో మోహన్ లాల్ సినిమా మొత్తం పంచకట్టులోనే కనిపించారు. రాజకీయా కథాంశంతో తెరకెక్కిన చిత్రం కాబట్టి ఇందులో హీరో పంచె కట్టులోనే కనిపించడంతో ఈ చిత్రానికి రీమేక్ గా రాబోతున్న తెలుగు సినిమాలో కూడా పంచె కట్టులోనే నటించడానికి చిరంజీవి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
చిరంజీవి లూసిఫర్:
మలయాళంలో ఎంతో విజయవంతమైన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో “కింగ్ మేకర్”,”అన్న”అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు మోహన్ రాజా లూసిఫర్ సినిమా ద్వారా చిరంజీవిని సరికొత్త లుక్ లో ప్రేక్షకులకు పరిచయం చేయనుండటంతో ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చే వార్త అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమాను సూపర్ గుడ్ ఫిలిమ్స్ తో పాటు, కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం సమకూర్చుతున్నారు. ఈ లూసిఫర్ చిత్రంలో హీరోయిన్ పాత ఉండదు, కేవలం హీరో సోదరి పాత్ర మాత్రమే ఎంతో కీలకంగా ఉంటుందని తెలుస్తోంది.ఆ పాత్రలో ఎవరు నటిస్తారనే విషయం గురించి పూర్తి క్లారిటీ తెలియాల్సి ఉంది. ఏదిఏమైనా మెగాస్టార్ చిరంజీవి పంచెకట్టులో నటిస్తుండడంతో అభిమానులు కూడా ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.