Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సైరా తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కమిటవుతూ వరుసగా ఒక్కోటి రిలీజ్ చేయాలని పక్కా ప్లాన్ చేసుకున్నారు. కానీ, అనూహ్యంగా దాదాపు మూడేళ్ళకు పైగానే గ్యాప్ వచ్చేసింది. దాంతో ఇప్పుడు వరుసబెట్టి సినిమాలను పూర్తి చేస్తున్న చిరు..అదే ఊపుతో వరుసగానూ రిలీజ్ చేసేందుకు మేకర్స్‌తో ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 25వ తేదీన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు మెగాస్టార్. తనయుడు మెగా పవర్ స్టార్ కూడా నటించిన ఈ మెగా మల్టీస్టారర్ మీద భారీ అంచనాలున్నాయి.
ఇక ఈ సినిమా తర్వాత చిరు నుంచి రాబోతున్న సినిమా గాడ్ ఫాదర్. ఈ సినిమాకు ఎన్నో స్పెషల్ అట్రాక్షన్స్ ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇది మెగా అబిమానులకు భారీ గిఫ్ట్ అని చెప్పాల్సిందే. ఇక స్టార్ హీరోయిన్ నయనతార, టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇద్దరు దర్శకులు చెప్పిన తెలుగు వెర్షన్ స్క్రిప్ట్ మెగాస్టార్‌కు నచ్చలేదు. ఆ రకంగా కూడా గాడ్ ఫాదర్ మొదలవ డానికి దాదాపు 8 నెలలకు పైగానే సమయం పట్టింది. అంటే మెగాస్టార్ ఈ సినిమా విషయంలో ఎంత పక్కాగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
Chiranjeevi: భోళా శంకర్ సినిమాను కూడా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు..!
ఇక తమిళంలో బ్లాక్ బస్టర్స్ తీసిన మోహన్ రాజా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే మెజారిటీ భాగం షూటింగ్ ముంబైలో పూర్తి చేశారు. ఇక సాంగ్స్ కంప్లీట్ చేయాల్సి ఉంది. మెగాస్టార్ – సల్మాన్‌లపై ఉండే సాంగ్ నెవర్ బిఫోర్ అనేలా ప్లాన్ చేస్తున్నారట. అయితే, గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మెగాస్టార్ బర్త్ డే అయిన ఆగస్ట్ 22 కాబట్టి అదే నెలలో మెగా అభిమానులకు సర్ప్రైజ్గా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తుందట. అంటే ఆచార్య రిలీజ్ అయిన నాలుగు నెలలకే గాడ్ ఫాదర్ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఇదే ఏడాది వీలైతే భోళా శంకర్ సినిమాను కూడా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.