మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించి వచ్చిన అప్ డేట్ లు పట్ల ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. చిరంజీవి నటించిన లాస్ట్ సినిమా “ఆచార్య” అట్టర్ ప్లాప్ కావడంతో వస్తున్న సినిమాలపై చాలా ఆశలు పెట్టుకోవడం జరిగింది. ఈ క్రమంలో చిరంజీవి జన్మదినానికి ఒక రోజు ముందుగానే ఆగస్టు 21 వ తారీకు ఆయన కొత్త సినిమా “గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ కావడం జరిగింది. ఈ టీజర్ అందరిని ఆకట్టుకోవడం జరిగింది.
టీజర్ లో చాలా కొత్తగా.. పాత్రకు తగ్గట్టు మెగాస్టార్ మెస్మరైజింగ్ లుక్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చిరంజీవి ఎంట్రీ.. తమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఎంతగానో అభిమానులను ఆకట్టుకుంది. అందుకే గాడ్ ఫాదర్ టీజర్ రిలీజ్ అయిన 18 గంటలకి యూట్యూబ్ లో ఏడు మిలియన్ వ్యూస్ సాధించి టాప్ లో ట్రెండింగ్ గా నిలిచింది. ట్రెండ్ అవ్వటం మాత్రమే 392.k వ్యూ పవర్ తో రేట్ తో యూట్యూబ్ నీ గాడ్ ఫాదర్ షేక్ చేస్తూ ఉంది. ఇదే సమయంలో అత్యధిక లైకులు కూడా సాధిస్తూ ఉంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ టీజర్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
చిరంజీవితో పాటు సల్మాన్ ఖాన్ కూడా కనిపించడంతో గాడ్ ఫాదర్ కి మరింత అదనపు గ్లామర్ లభించింది. రాజకీయ నాయకుడిగా చిరంజీవి కనిపించడంతోపాటు టీజర్ లో నయనతార డైలాగులు సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఎంతగానో సినిమాపై ఇంట్రెస్ట్ కలిగించడం జరిగింది. మోహన్ రాజా దర్శకత్వంలో జరిగే “గాడ్ ఫాదర్” దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5వ తారీఖు సినిమా విడుదల చేస్తున్నట్లు టీజర్ లో స్పష్టం చేయడం జరిగింది.