God Father: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా మోహన్ రాజా(Mohan Raja) దర్శకత్వంలో దొరక ఎక్కుతున్న సినిమా “గాడ్ ఫాదర్”. మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) హీరోగా లూసిఫర్(Lucifer) సినిమాగా తరికెక్కిన ఆ సినిమా అని తెలుగులో “గాడ్ ఫాదర్”(God Father) గా రీమేక్ చేస్తున్నారు. సినిమాకి సంబంధించి షూటింగ్ సర్వవేగంగా సాగుతోంది. తాజాగా సినిమా యూనిట్ ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. జులై 4వ తారీఖు సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు “గాడ్ ఫాదర్” ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. మేకర్స్ స్పష్టం చేశారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ సినిమాలో చిరంజీవి తో పాటు సల్మాన్ ఖాన్(Salman Khan)… కీలకమైన పాత్రలో చేస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో జరగబోతున్న ఈ సినిమాలో సల్మాన్ మాఫియా డన్ గా నటిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా.. చిన్న పాత్ర చేసినట్లు.. అది జర్నలిస్ట్ క్యారెక్టర్ అని సమాచారం. తమన్ సంగీతం అందిస్తున్నారు. చిరంజీవి సొంత నిర్మాణ సంస్థ కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినిమా నిర్మిస్తున్నారు. ఈ దసరా పండుగకు “గాడ్ ఫాదర్” రిలీజ్ కానుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన “ఆచార్య” అట్టర్ ప్లాప్ కావడం తెలిసిందే.
కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో తెరకెక్కిన “ఆచార్య” ఏమాత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది. టైగర్ రామ్ చరణ్ తో కలిసి ఫుల్ లెంత్ లో నటించిన సినిమా ఏ మాత్రం మెప్పించలేకపోయింది. దీంతో చిరంజీవి ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెట్టడం జరిగింది. అయితే ముందుగా గాడ్ ఫాదర్ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాపై చిరంజీవి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. రాజకీయ నేపథ్యంలో.. గ్యాంగ్ స్టార్ తరహా లో.. స్టోరీ ఉండటంతో చిరంజీవి లుక్ ఎలా ఉంటుందో.. ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఆత్రుతగా ఉన్నారు.