సినిమా

Chiranjeevi: భార్య‌తో విదేశాల‌కు వెళ్లిపోతున్న చిరంజీవి.. వైర‌ల్‌గా ఇన్‌స్టా పోస్ట్‌!

Share

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇటీవ‌లె `ఆచార్య‌`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. కొర‌టాల శివ తెర‌కెక్కించిన ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డింది. దీంతో చేసేదేమి లేక‌ చిరు త‌న త‌దుప‌రి చిత్రాల‌పై దృష్టి మ‌ల్లించారు. ప్ర‌స్తుతం ఈయ‌న ఏకంగా మూడు చిత్రాలు చేస్తున్నాడు.

అందులో `గాడ్ ఫాద‌ర్‌` ఒక‌టి కాగా.. ఇది మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోంది. అలాగే మెహ‌ర్ ర‌మేష్ తో `భోళా శంక‌ర్‌`, బాబీ డైరెక్ష‌న్ లో `మెగా 154` చిత్రాలు చేస్తున్నాడు. ఈ మూడు చిత్రాలు సెట్స్ మీదే ఉన్నాయి. అయితే ఇన్న‌ళ్లు వ‌రుస షూటింగ్స్‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపిన చిరు.. తాజాగా కాస్త బ్రేక్ తీసుకుని భార్య‌తో విదేశాల‌కు ప‌య‌ణ‌మ‌య్యారు.

అవును, ఈయ‌న త‌న భార్య సురేఖతో వరల్డ్ టూర్‌కు ప్లాన్ చేశారు. ఈ జంట ప్రపంచంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో విహరించనున్నారు. యూఎస్ఏ తో పాటు యూరప్ లో వీరి వెకేషన్ సాగనుంది. ఈ విష‌యాన్ని అధికారికంగా తెలియ‌జేసిన చిరంజీవి.. ప్రైవేట్ జెట్‌లో భార్య దిగిన ఓ పిక్ కూడా షేర్ చేశారు.

దీంతో ఆయ‌న ఇన్‌స్టా పోస్ట్ కాస్త నెట్టింట వైర‌ల్‌గా మార‌గా.. నెటిజ‌న్లు హ్యాపీ జ‌ర్నీ అంటూ కామెంట్ బాక్స్‌ను నింపేస్తున్నారు కాగా, కరోనా వ‌చ్చిన తర్వాత చిరంజీవి తొలిసారి వరల్డ్ టూర్ కి వెళుతున్నారు. ఈ వెకేష‌న్ పూర్తి కాగానే.. మ‌ళ్లీ ఆయ‌న షూటింగ్స్ తో బిజీ బిజీగా మారునున్నారు.

https://www.instagram.com/p/CdFc9DJJPOm/?utm_source=ig_web_copy_link


Share

Related posts

‘V’ ట్రైలర్ – ఇది కదా టాలీవుడ్ అభిమానులకి కావాల్సిన ఎమోషన్!

arun kanna

Charmme Kaur: ఎంత రిక్వెస్ట్ చేసినా అందుకు మాత్రం నో అంటోన్న ఛార్మి..!

GRK

Acharya : ఆచార్య.. నారప్ప సినిమాల మీద ఆప్రభావం పడితే బాధ్యులెవరు ..?

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar