NewsOrbit
సినిమా

వాళ్ల‌కు నావంతు స‌హాయం చేస్తా – చిరంజీవి

“సంగీతమంటే నాకు ప్రాణం. సంగీతం లేనిదే నేను లేను. అప్పటి చక్రవర్తి, ఇళయరాజా నుంచి రాజ్ కోటి, ఇప్పటి మణిశర్మ దాకా ఎంతోమంది సంగీత దర్శకుల బాణీలు, పాటలు, సంగీతం పాటలు ద్వారా నేను ప్రజలకు మరింత దగ్గరయ్యాను. వారందరితో అనుబంధాన్ని మర్చిపోలేను” అని హీరో చిరంజీవి అన్నారు. సినీ మ్యుజీషియన్స్ యూనియన్ పక్షాన హైదరాబాద్‌లో శనివారం జరిగిన స్వరసంగమం సంగీత విభావరికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినీ సంగీత వాద్య కళాకారుల ఆర్థిక, ఆరోగ్య సంక్షేమం కోసం నిధుల సేకరణ నిమిత్తం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఏర్పాటు చేయడాన్ని ఆయన అభినందించారు. “ఒకప్పుడు మద్రాసులో ఏ.వి.ఎం, ప్రసాద్ స్టూడియో లాంటి స్టూడియోలలో పెద్ద రికార్డింగు హాళ్ళలో లైవ్ ఆర్కెస్ట్రాతో పాటలు రికార్డింగ్ చేస్తుంటే పండుగలా ఉండేది. ఇప్పుడు ఆధునిక సాంకేతికత వల్ల చిన్న గదుల్లోనే, డిజిటల్‌ గా ఆ ఎఫెక్టులను సృష్టిస్తున్నాం. ఆధునిక పరిజ్ఞానానికి సంతోషించాలో, బాధపడాలో అర్థం కావడం లేదు. అయితే, దీనివల్ల ఎంతోమంది సంగీత వాద్య కళాకారుల జీవనోపాధిపోవడం, నిపుణులైన కళాకారులు వేరే ఉద్యోగాలకు వెళ్ళిపోతుండడం బాధగా ఉంది. వాళ్ళను ఆదరించి, కష్టాల్లో ఉన్న వాద్య కళాకారులను పరిశ్రమ తరఫున ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. అందుకు నా వంతుగా నేను సైతం అంటూ సాయమందిస్తా” అని చిరంజీవి సభాముఖంగా ప్రకటించారు.

నా పాటకు తెరపై ప్రాణం చిరంజీవి – ఎస్పీబీ

తెలంగాణకు చెందిన మంత్రి శ్రీనివాస గౌడ్, శాసనసభ్యుడు రసమయి బాలకిషన్, నిర్మాత కె. వెంకటేశ్వరరావు, నటి రేణూ దేశాయ్, దర్శకుడు రాహుల్ రవీంద్ర, సినీ మ్యుజీషియన్స్ యూనియన్ కార్యవర్గ ప్రముఖులు గాయని విజయలక్ష్మి (అధ్యక్షురాలు), కౌసల్య, అర్పీ పట్నాయక్, లీనస్ తదితరులు పాల్గొన్న ఈ సభలో సీనియర్ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, వాద్య కళాకారుల గొప్పతనాన్ని గుర్తుచేశారు. వాళ్ళ సంక్షేమం కోసం అందరూ కలసి, ఏదైనా చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. “మేము ఎంత పాడినా, ఏం చేసినా, మా పాటలోని ఫీల్‌ను గ్రహించి, అద్భుతంగా తెరపైన అభినయించినప్పుడే వాటికి సార్థకత. అలా నా పాటలకు అత్యద్భుతంగా అభినయించి, తెరపై ప్రాణం పోసిన ఏకైక నటుడు చిరంజీవి. చిరంజీవిని కేవలం ఓ నటుడు అని నేను అనను. అతను మంచి పెర్ఫార్మర్. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆర్టిస్ట్. కేవలం అభిమానుల ఆనందం కోసం తనలోని అభినయ నైపుణ్య కోణాన్ని కూడా పక్కనపెట్టి, కొన్ని పాత్రలు చేయాల్సి వచ్చింది. చేశారు. ఇప్పుడు రానున్న సైరా లాంటిచిత్రాలు అతనిలోని అభినయ కోణాన్ని మరోసారి చూపెడతాయి” అని ఎస్పీబీ అభిప్రాయపడ్డారు.

author avatar
Siva Prasad

Related posts

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Leave a Comment