Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో “ఆచార్య” విడుదల చేసి అట్టర్ ఫ్లాప్ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో దసరా పండుగ నాడు “గాడ్ ఫాదర్” తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మలయాళం “లూసిఫర్” సినిమాకి రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో చిరంజీవి రాజకీయ నాయకుడు పాత్రలో కనిపిస్తూ ఉన్నారు. సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషించడం జరిగింది. పూరి జగన్నాథ్ కూడా చిన్నపాటి గెస్ట్ పాత్ర వేశారు. మరోపక్క మెహర్ రమేష్ దర్శకత్వంలో “బోలా శంకర్”, బాబీ దర్శకత్వంలో “వాల్తేరు వీరయ్య” ప్రాజెక్ట్ లు చేస్తున్నారు.
పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు మరో దర్శకుడితో పని చేయడానికి చిరంజీవి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళ్తే దర్శకుడు ప్రభుదేవాతో కలిసి సినిమా చేయడానికి చిరంజీవి రెడీ అయినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో పాపులర్ అయిన ఓ స్పానిష్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ బాగా నచ్చడంతో దాన్ని సినిమాగా చేయాలని.. చిరంజీవి డిసైడ్ అయ్యారట. ఈ బాధ్యతను ప్రభుదేవాకి అప్పజెప్పినట్లు సమాచారం. దీంతో ప్రభుదేవా సినిమా స్టోరీ రెడీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ ప్రాజెక్టు ఓకే అయితే మాత్రం దాదాపు 15 సంవత్సరాల తర్వాత మళ్లీ ప్రభుదేవాతో చిరంజీవి సినిమా చేస్తున్నట్లు అవుతుంది. 15 సంవత్సరాల క్రితం ప్రభుదేవా దర్శకత్వంలో చిరంజీవి “శంకర్ దాదా జిందాబాద్” సినిమా చేశారు. సరిగ్గా పొలిటికల్ ఎంట్రీ ముందు వచ్చిన ఈ సినిమా పెద్దగా అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. అయితే మళ్లీ చాలాకాలం తర్వాత ప్రభుదేవాతో చిరంజీవి సినిమా చేయడానికి రెడీ అయినట్లు టాక్ నడుస్తోంది. ఇటీవలే “గాడ్ ఫాదర్” లో చిరు, సల్మాన్ స్పెషల్ సాంగ్ కి ప్రభుదేవా కొరియోగ్రాఫర్ చేశారు. ఆ టైములో డిస్కషన్ జరిగినట్లు ప్రస్తుతం ప్రభుదేవా సినిమా స్టోరీ రెడీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.