Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఉన్నారు. పాండమిక్ తర్వాత ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఏ హీరో చేయని రీతిలో మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చేసి మూడు విడుదల చేయడం జరిగింది. మూడింటిలో రెండు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. గత ఏడాది ఏప్రిల్ నెలలో “ఆచార్య”… అక్టోబర్ నెలలో “గాడ్ ఫాదర్” సినిమా విడుదల చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఈ ఏడాది స్టార్టింగ్ లో సంక్రాంతి పండుగ కానుకగా “వాల్తేరు వీరయ్య”తో తిరుగులేని విజయాన్ని అందుకోవటం జరిగింది. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో “భోళా శంకర్” సినిమా చేస్తున్నారు.
అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో చిరంజీవి చెల్లెల పాత్రలో.. కీర్తి సురేష్ నటిస్తోంది. తమన్నా హీరోయిన్ గా చేస్తుంది. అక్కినేని సుశాంత్… కీర్తి సురేష్ బాయ్ ఫ్రెండ్ గా కనిపించనున్నాడు. తమిళంలో అజిత్.. నటించిన సినిమాని తెలుగులో చిరంజీవి రీమేక్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు తమిళ దర్శకుడు PS మిత్రన్ ఇటీవల చిరంజీవికి స్టోరీ వినిపించడం జరిగిందంట. ఎంతో బాగా నచ్చడంతో చిరంజీవి ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ సినిమాని చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత నిర్మించనున్నారు. సోగ్గాడే చిన్నినాయన, బింబిసారా దర్శకుడు వశిష్ట కూడా ఇటీవల చిరంజీవికి స్టోరీ వినిపించినట్లు ఎంతో నచ్చినట్లు… త్వరలో ఈ ప్రాజెక్టు కూడా పట్టాలెక్కనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
త్వరలోనే ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి అధికారిక ప్రకటనలు రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న “భోళా శంకర్” సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆగస్టు నెలలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో మే నెలలో చిరంజీవి కొత్త సినిమా ప్రాజెక్టుల అధికారిక ప్రకటనలు ఉండబోతున్నట్లు టాక్. చిరంజీవి కూతురు సుస్మిత అంతకుముందు కాస్ట్యూమ్ డిజైనర్. చాలావరకు చిరంజీవి సినిమాలకు పనిచేయడం జరిగింది. ఈ ఏడాదిలోనే “శ్రీదేవి శోభన్ బాబు” సినిమాతో నిర్మాణ రంగంలో అడుగు పెట్టడం జరిగింది. ఈ క్రమంలో ఇంకా పెద్ద సినిమాలు చేయడానికి రెడీ అయినట్లు తండ్రి.. చిరంజీవి సినిమాలు దగ్గరుండి చేయాలని డిసైడ్ అయినట్లు.. తెలుస్తోంది.
Sensation: 2022 టాలీవుడ్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హీరో హీరోయిన్స్..!!