NewsOrbit
సినిమా

Chiranjeevi: అన‌సూయ‌తో అలాంటి ప‌ని.. భార్య‌కు దొరికేసిన చిరంజీవి!

Advertisements
Share

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం త‌ర్వాత ఓ కమర్షియల్ యాడ్‌లో న‌టించారు. శుభగృహ రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న చిరంజీవి.. తాజాగా స‌ద‌రు సంస్థ ప్రమోష‌న‌ల్ యాడ్‌లో భాగం అయ్యారు. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ఈ యాడ్‌ను తెర‌కెక్కించారు. తాజాగా ఈ యూడ్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

Advertisements

ఇందులో చిరంజీవికి భార్య‌గా ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్ ఖుష్బూ సుంద‌ర్ న‌టించ‌గా.. స్టార్ యాంక‌ర్ అన‌సూయ శుభ గృహ ఏజెంట్ పాత్ర‌ను పోషించింది. ఇక యాడ్ వివ‌రాల్లోకి వెళ్తే.. చిరంజీవి బ‌య‌ట‌కు వెళ్లేందుకు హ‌డావుడిగా సిద్ధమవుతూ ఉండ‌గా.. `ఈరోజు ఏంటో గుర్తుందా మీకు?` అంటూ ఖుష్బూ హారతి పట్టుకొని వ‌స్తుంది. అందుకు చిరు ఇంటి అద్దె కదా కట్టేద్దాం అని అంటాడు. ఇంత‌లోనే అనసూయ నుంచి ఫోన్ కాల్ రావ‌డంతో.. చిరు ఖంగారు ప‌డుతూ తన ఫ్రెండ్ గౌతమ్ అని అబద్ధం చెప్పి వెళ్లిపోతారు.

Advertisements

భ‌ర్త తీరుపై అనుమానం రావ‌డంతో.. చిరు వెన‌కే ఫాలో అవుతూ ఖుష్బూ వెళ్తుంది. క‌ట్ చేస్తే అనుసూయ లెట్ అయ్యింది ఏమిటి అని ప్ర‌శ్నించ‌గా.. అందుకు చిరు నువ్వు ఫోన్ చేసినప్పుడు తను పక్కనే ఉంది తెలుసా. కానీ తెలియకుండా మ్యానేజ్ చేశానని అంటాడు. ఇక ఆ తరువాత అపార్ట్మెంట్ లోని ఒక రూమ్ లోకి వాళ్లిద్దరూ క్లోజ్ గా వెళ్తారు. ఇదంతా చూసి ఆగ్రహంతో వాళ్లు వెళ్లిన రూమ్ లోకి ఖుష్బూ వెళ్లి ఒక్క‌సారిగా షాక్ అవుతుంది. దాంతో చిరు ప‌నైపోయింది, అన‌సూయ‌తో అడ్డంగా దొరికేశాడ‌ని ప్రేక్ష‌కులు అనుకుంటారు.

కానీ, తన భార్య పుట్టిన రోజు కావ‌డంతో ఓ ఇంటిని కొనుగోలు చేసి బహుకరించాల‌ని చిరు అనుకుంటాడు. ఈ విష‌యంపైనే అన‌సూయతో మాట్లాడుతూ.. ఇంటి పేప‌ర్లపై సంత‌కాలు చేస్తుంటాడు. ఇందంతా చూసిన ఖుష్బూ ఆనందంతో క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. ఆమెను గ‌మ‌నించిన చిరు.. వెంట‌నే పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి కొనుగోలు చేసిన ఇంటి పేప‌ర్ల‌ను భార్య చితికి అందిస్తాడు. మొత్తానికి అన్ని వ‌ర్గాల వారిని ఆక‌ట్టుకుంటున్న ఈ యాడ్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.


Share
Advertisements

Related posts

Champika New Wallpapers

Gallery Desk

RRR: ఆ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం విజయేంద్రప్రసాద్ కీలక కామెంట్స్..!!

sekhar

అనుష్క జీవితంలో ఆ ఒక్క రోజు ఎంత మార్చేసిందో తెలుసా?

Teja