NewsOrbit
Featured బిగ్ స్టోరీ సినిమా

Chiranjeevi.. మేకప్ టచప్ లోనే ఉంటారా.. లేక మళ్లీ పొలిటికల్ టచ్ ఇస్తారా..?

చిరంజీవి సైతం ఛాన్స్ దక్కలేదని కంటతడి పెట్టుకున్నా ఆ పవర్ ఫుల్ సినిమా ఎదో తెలుసా??

Chiranjeevi.. ప్రస్తుతం మేకప్ టచప్ లోనే ఉన్న చిరంజీవిని మళ్లీ పొలిటికల్ టచ్ ఇప్పించేందుకు కొన్ని రాజకీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయా..? ఇది ఒక్క చిరంజీవికి తప్ప మరెవరికీ తెలీని విషయం. సినిమాలపరంగా 42 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ ఆయన సొంతం. కెరీర్లో ఎత్తుపల్లాలు, కష్టనష్టాలు, సాధకబాధలు, గెలుపోటములు.. అన్నింటికిమించి తిరుగులేని నెంబర్ వన్ స్థానం, అప్రతిహతమైన ఫ్యాన్ బేస్, కీర్తిప్రతిష్టలు చూశారు. అదే విధంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. తొమ్మిదేళ్లలో అంతకు మించి జీవిత పాఠాలు తెలుసుకున్నారు.. నేర్చుకున్నారు. తనకు రాజకీయ రంగం సరిపడదు అని చిరంజీవికి అతి తక్కువ సమయంలోనే.. అంటే కేవలం ఏడాది కాలంలోనే తెలిసిపోయింది. ఆ తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగిన తీరు మెగాస్టార్ గా ఆయన వెలిగిన వెలుగులకు వ్యతిరేక దిశలో కొనసాగింది.

chiranjeevi-may-get-clarity
chiranjeevi-may-get-clarity

Chiranjeevi చిరంజీవి సినిమా ఇమేజ్ స్థాయి..

చిరంజీవి ఛాలెంజ్ సినిమాలో ‘అయిదు సంవత్సరాల్లో 50 లక్షలు సంపాదిస్తాను’ అనే పాపులర్ డైలాగ్ ఉంది. ఈరోజుల్లో కూడా అది కష్టమే అయినా.. తెలివితేటలు ఉంటే ఇంకాస్త తక్కువ సమయమ పట్టొచ్చు. చిరంజీవికి నేటి జనరేషన్ కు మధ్య ఉన్న కెరీర్ డెవలప్ మెంట్ ఇదే సూచిస్తుంది. లక్ష్యం, అదృష్టం ఉంటే స్టార్ హీరోగా కాకపోయినా హీరోగా రాణించేందుకు నాలుగైదేళ్లు పడుతుంది. చిరంజీవికి కూడా అంతే. గుర్తింపు రెండేళ్లు, స్టార్ హీరోకి 5 ఏళ్ల సమయం పట్టింది. కానీ.. చిరంజీవి 1978లో సినిమాల్లోకి వస్తే 1988కి.. కేవలం పదేళ్లలోనే మెగాస్టార్ గా, నెంబర్ వన్ హీరోగా, సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్ లో ఒకరిగా ఎదిగిపోయారు. ఇంతై ఇంతింతై వటుడింతై.. అన్నట్టుగా ఆయన ఇమేజ్ పెరిగిపోయింది. ఇంత భారీ ఇమేజ్ తో చిరంజీవి ఎవరూ చేయని విధంగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఫ్యాన్స్ ను సేవా మార్గంలో నడిపించారు. సినిమాల్లోకి వచ్చిన 28 ఏళ్లలోనే దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘పద్మభూషణ్’ గౌరవం అందుకున్నారు. స్థూలంగా ఇదీ ఆయన సాధించిన కీర్తి శిఖరాలు. అయితే..

రాజకీయంగా ప్రస్థానం ఇలా..

2008లో సినిమాలకు సెలవు చెప్పి రాజకీయాల్లోకి వచ్చి ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. తిరుపతిలో జరిగిన పార్టీ ఆవిర్భావ సభకు వచ్చిన అభిమాన జనసందోహం చూసి తెలుగునాట కొత్త రాజకీయ శకం ప్రారంభమైందనే అనుకున్నారు. కానీ.. కేవలం ఏడెనిమిది నెలల్లోనే పార్టీ చతికిలపడింది. రాజకీయంగా చిరంజీవి వాగ్భాణాలు సంధించలేకపోయారు. రాజకీయ ఉద్దండులు వైఎస్, చంద్రబాబు తరహాలో రాజకీయంగా ఆకట్టుకోలేకపోయారు. రాజకీయ కుట్రలకు బలైపోయారు. సౌమ్యుడిగా పేరున్న చిరంజీవి రాజకీయ పద్మవ్యూహంలో చిక్కుకుపోయారు. ఓవర్గం మీడియా చిరంజీవికి వ్యతిరేకంగా పని చేసింది. సీట్లు అమ్ముకుంటున్నారు అనే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో చిరంజీవి పూర్తిగా విఫలమయ్యారు. చిరంజీవిని చూసేందుకు ఆసక్తి చూపిన జనం ఓట్లు వేయలేదు. ఫలితంగా ప్రజారాజ్యం ఓడిపోయింది. స్వయంగా చిరంజీవే పాలకొల్లులో ఓడి తిరుపగతిలో గెలిచి గట్టెక్కారు. తర్వాత రోజుల్లో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రి అయినా.. ఆయన స్థాయికి తగినది కాదు. మొత్తంగా రాజకీయాల నుంచి వచ్చేసి మళ్లీ 2017 నుంచీ కేవలం సినిమాల్లోనే కొనసాగుతున్నారు.

 

రాజకీయ పాఠాలు గుణపాఠాలు అవుతాయా..?

మొత్తంగా ఈ రాజకీయ పయనం చిరంజీవికి ఓ చేదు జ్ఞాపకం. కానీ.. ఇటివల చిరంజీవి రాజకీయాల్లోకి తమ్ముడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనతో అరంగేట్రం చేస్తారని వార్తలు వస్తున్నాయి. వీటిని పవన్ కల్యాణ్ కూడా సమర్ధించలేదు. కుటుంబసభ్యుడిగా పవన్ కే మా మద్దతు ఉంటుందని చిరంజీవి మాట మాత్రంగా చెప్పి ఉండొచ్చు. దాన్నే.. నాదెండ్ల ఓ మాటగా చెప్తే మీడియా విపరీతంగా హైలైట్ చేసి కథలు అల్లేసింది. టీవీల్లో, పేపర్లలో బ్యానర్ వార్త అయిపోయింది. నిజానికి చిరంజీవి రాజకీయాల్లోకి రావాల్సిన సమయం ఇది. కానీ.. 13 ఏళ్ల క్రితమే ఆ పని చేసి మళ్లీ రాజకీయాల వైపు చూడాలంటేనే జంకు పుట్టేంత అనుభవాన్ని సంపాదించారు. రాజకీయాలకు వ్యతిరేకంగా ఆయన పూర్వ వైభవం సినిమాల్లో కొనసాగుతోంది. కుటుంబసభ్యులు ఎందరో హీరోలుగా ఉన్నారు. ప్రపంచంలో మరే నటుడి ఇంటి నుంచి కూడా ఇంతమంది హీరోలు లేరు. ఇద్దరు సూపర్ స్టార్లు అయ్యారు కూడా. రాజకీయాల కంటే చిరంజీవికి సంతోషాన్నిచ్చేది ఇదే. ఈ సమయంలో చిరంజీవి మళ్లీ రాజకీయంగా క్రియాశీలకం అవుతారని భావించలేం. కానీ.. రాజకీయ శక్తులు, మీడియా ఊరుకోవు. ఉద్రేకపరుస్తాయి.. ప్రలోభపెడతాయి. మళ్లీ చిరంజీవి ఆ ఉచ్చులో పడరని.. పడకూడదనే భావిద్దాం..!

author avatar
Muraliak

Related posts

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Tarun: హీరో తరుణ్ ఒక్కసారిగా సినిమాలు ఆపేయడానికి కారణం ఇదా?.. బయటపడ్డ సీక్రెట్..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు కొడుకును ఇండస్ట్రీకి రాకుండా ఆపింది ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rajamouli: ఎన్టీఆర్ నటించిన ఆ మూవీని చూసి.. జీవితంలో ఆ విధంగా చేయకూడదని ఫిక్స్ అయిపోయిన రాజమౌళి..!

Saranya Koduri

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Karthika Deepam 2 April 23th 2024 Episode: నరసింహ చంప పగిలేలాగా కొట్టిన సుమిత్ర.. నేనే దీప తల్లిని అంటూ ట్విస్ట్..!

Saranya Koduri

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Krishna Mukunda Murari April 23 2024 Episode 450: ఆదర్శ్ కి అడ్డంగా దొరికిపోయిన ముకుంద. క్రిష్ణ మురారి బాధ. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Trinayani April 23 2024 Episode 1220: అమ్మవారి పూజ చేసిన నైని గాయత్రీ దేవి జాడ తెలుసుకుంటుందా లేదా..

siddhu

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

Jagadhatri April 23 2024 Episode 212: అఖిలాండేశ్వరి కాళ్లు పట్టుకున్న కేదార్, నువ్వు  ఓడిపోవు కౌశికి అంటున్న అఖిలాండేశ్వరి..

siddhu

Brahmamudi April 23 2024 Episode 391: రాజ్ కొడుకు పై మీడియా ఆరా.. రాజ్ కి అర్హత లేదన్న అనామిక.. మీడియా ముందు ఇంటిగుట్టు..?

bharani jella