Bunny: మెగా హీరోలు అంటే మొదటి నుండి చిరంజీవి ఫ్యామిలీ హీరోలతో పాటు అల్లు అర్జున్ పేరు కూడా వినబడేది. మెగా ఫ్యాన్స్ కి సంబంధించి అప్పట్లో అల్లు అర్జున్ కూడా అనేక కార్యక్రమాలలో పాల్గొనేవారు. మెగా ఫ్యామిలీ హీరోస్ అంటే ఇండస్ట్రీలో చిరంజీవి, పవన్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఇంకా పలువురు పేర్లు ఇండస్ట్రీ గుర్తించేది. ఈ క్రమంలో ఎవరికి వారు తమ సినిమాలతో రాణిస్తూ తనకంటూ సెపరేట్ మార్కెట్ బయట క్రియేట్ చేస్తున్నారు.
ఇదంతా పక్కన పెడితే ఇటీవల విజయవాడలో మెగా అభిమానుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమం ఆలిండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వామి నాయుడు ఆధ్వర్యంలో జరిగింది. అయితే ఈ సమావేశంలో అల్లు అర్జున్ ఫోటో ఎక్కడ కూడా కనిపించలేదు. అంతమాత్రమే కాదు కార్యక్రమంలో ఎక్కడా కూడా బన్నీ ప్రస్తావన తీసుకురావడం జరగలేదని టాక్. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డైరెక్టర్ బాబు హాజరయ్యారు. దీంతో మెగా అభిమానులు బన్నీ నీ పక్కన పెట్టేసినట్టు సరికొత్త టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ లో వినపడుతోంది.
మరోపక్క బన్నీ కి కూడా ఇదే కావాలని ఎప్పటినుండో ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. దాదాపు అయిదు సంవత్సరాల కాలంలో బన్నీ సినిమాల పరంగా చాలా తెలివిగా చేసుకుంటూ పోతున్నాడు. “పుష్ప” సినిమా తో పాన్ ఇండియా మార్కెట్ లో కూడా ఇప్పుడు తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. సో అన్ని రకాలుగా బన్నీ.. సక్సెస్ఫుల్ కెరియర్ తో దూసుకుపోతున్నాడు. ఇటువంటి తరుణంలో మెగా అభిమానుల సమ్మేళన్ కార్యక్రమంలో మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ని పక్కన పెట్టడం .. ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.