Bholaa Shankar Teaser: మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన “భోళా శంకర్” సినిమా టీజర్ తాజాగా కొద్ది నిమిషాల క్రితం విడుదలయ్యింది. చాలా కాలం తర్వాత డైరెక్షన్ మైకు పట్టుకున్న మెహర్ రమేష్.. మరోసారి తన సత్తా ఏంటో టీజర్ లో చూపించడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవిని చాలా అద్భుతంగా స్టైలిష్ లుక్ లో చూపించారు. మాస్ మరియు ఎంటర్టైన్మెంట్ కమర్షియల్ నేపథ్యంలో సిస్టర్ సెంటిమెంట్ తో “భోళా శంకర్” తెరకెక్కినట్లు తెలుస్తోంది. టీజర్ లో స్టేట్ డివైడైన.. అందరూ నా వాళ్లే. నాకు హద్దులు లేవు సరిహద్దులు లేవు ఆగస్టు 11 వ తారీకు కలుద్దాం అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్ చాలా హైలెట్ గా నిలిచింది.
“భోళా శంకర్” లో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. కీర్తి సురేష్ చెల్లెలి పాత్ర చేసింది. అక్కినేని సుశాంత్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. చాలాకాలం తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వం వహించటంతో ఈ సినిమా ఫలితం పై మెగా ఫ్యాన్స్ కొద్దిగా టెన్షన్ పడుతున్నారు. మరి ముఖ్యంగా అంతకుముందు మెహర్ రమేష్ తీసిన సినిమాలు ఏవి కూడా సరిగ్గా ప్రేక్షకులను అలరించలేకపోవడంతో “భోళా శంకర్” తో ఏ మేరకు ఆకట్టుకుంటాడో అనేది ఉత్కంఠ భరితంగా మారింది. మరోపక్క చిరంజీవి వరుస పెట్టి బ్యాక్ టు బ్యాక్ రెండు విజయాలు అందుకున్నారు.
గత ఏడాది “గాడ్ ఫాదర్” ఆ తర్వాత ఈ ఏడాది ప్రారంభంలో “వాల్తేరు వీరయ్య” తో రెండు విజయాలు ఖాతాలో వేసుకోవడం జరిగింది. దీంతో “భోళా శంకర్” తో హ్యాట్రిక్ విజయం అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. తమిళంలో హీరో అజిత్ నటించిన “వేదాళం” సినిమాకి రీమేక్ గా “భోళా శంకర్” తెరకెక్కింది. తెలుగు ప్రేక్షకుల అభిరుచి మేరకు స్టోరీలో కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. అన్నా చెల్లెల సెంటిమెంట్ నేపథ్యంలో తమిళంలో “వేదాళం” ఘన విజయం సాధించింది. మరి అదే ఫార్ములతో వస్తున్న “భోళా శంకర్” తెలుగు ప్రేక్షకులను ఏ రకంగా అలరిస్తాదో చూడాలి.