Chiru Pawan: ఇటలీలో నవంబర్ మొదటి తారీకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. లావణ్య త్రిపాఠిల వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహ కార్యక్రమానికి అతికొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. మెగా కుటుంబ సభ్యులతో పాటు ఇండస్ట్రీలో నితిన్ జంట మరి కొంతమంది పెళ్లికి వెళ్లడం జరిగింది. మొత్తం 120 మంది కుటుంబ సభ్యుల సమక్షంలో మీరు వివాహం జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియా నిండా వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతూ ఉన్నాయి. కాక్ టైల్ పార్టీ మొదలు.. మెహందీ ఇంకా రకరకాల కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. అదేవిధంగా వరుణ్ తేజ్ మరియు లావణ్యాలు పెళ్లి బట్టలలో దిగిన ఫోటోలు కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
చాలాకాలం తర్వాత మెగా ఫ్యామిలీ మరియు ఫ్యామిలీ ఒకే దగ్గర కనిపించేసరికి వరుణ్ పెళ్లి వేడుక సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ చాలా ఖరీదైన పెళ్ళికానుకలు ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. విషయంలోకి వెళ్తే చిరంజీవి.. ధనవంతు బహుమతిగా రెండు కోట్లు ఖరీదు చేసే డైమండ్ సెట్ ఇచ్చినట్లు సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ మాత్రం కోడలు లావణ్య త్రిపాఠికి గార్లంటే ఇష్టం అని తెలిసి కోటి రూపాయలు ఖరీదు చేసే కారు గిఫ్ట్ గా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
దీంతో చిరంజీవి, పవన్ ఇచ్చిన పెళ్ళికానుకలు చూసి వరుణ్ మరియు లావణ్యలు సర్ప్రైజ్ అయ్యారట. ఇదిలా ఉంటే నవంబర్ 5వ తారీఖు హైదరాబాదులో దాదాపు 1,000 మందికి గ్రాండ్ గా నాగబాబు రిసెప్షన్ ఏర్పాటు చేయడం జరిగిందట. ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులను ఆహ్వానించినట్లు సమాచారం. ఆల్రెడీ ఇటలీలో మెగా కుటుంబ సభ్యులంతా రిటర్న్ బయలుదేరడం జరిగిందట. నవంబర్ 4న హైదరాబాద్ కి చేరుకొని రిసెప్షన్ కి రెడీ కాబోతున్నట్లు సమాచారం.