కొందరు స్టార్ హీరోలకు కొన్ని పాత్రలు బాగానే కలిసొస్తాయి. అలాంటి పాత్రల్లో టీచర్ పాత్ర మెగాస్టార్ చిరంజీవికి బాగా కలిసొస్తుంది. ఆయన టీచర్‌గా నటించిన మాస్టర్, అలాగే ప్రొఫసర్‌గా నటించిన ఠాగూర్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ చిత్రాలుగా నిలిచాయి. ఇప్పుడు చిరంజీవి తన 152వ చిత్రంలో టీచర్ పాత్రలో కనిపించబోతున్నారని టాక్. దేవాలయాల్లో జరిగే అవినీతి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కబోయే చిత్రంలో చిరు టీచర్‌గా కాసేపు కనిపిస్తారట. కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!