ఆది.. ఈసారి పక్కాగా కొట్టేట్టున్నాడు..! మెగాస్టార్ రిలీజ్ చేసిన ‘శశి’

chiranjeevi released adi hero venture sasi movie teaser
Share

‘న్యూ టాలెంట్ రావాలి.. కొత్త ఆలోచనలతో పరిశ్రమ ఎదగాలి, మీలాంటి యంగ్ జనరేషన్ సినీ పరిశ్రమకు అవసరం’ ఇవన్నీ రీసెంట్ గా బిగ్ బాస్ షోలో మెగాస్టార్ చిరంజీవి అన్న మాటలు. కొత్తవారిని, న్యూ జనరేషన్ ను ఆయన ఎంకరేజ్ చేసే తీరే భిన్నంగా ఉంటుంది. ఎంతోమంది.. చిరంజీవి మాకు స్ఫూర్తి అంటున్నారంటే కారణం అదే. ప్రముఖ తెలుగు నటుడు, కన్నడ సీనియర్ స్టార్ హీరో సాయి కుమార్ తనయుడు ‘ఆది’ కూడా ఇప్పుడు చిరంజీవి ఆశీస్సులు తీసుకున్నారు. దాదాపు దశాబ్దం క్రితమే ‘ఆది’ని హీరోగా పరిచయం అయ్యాడు. ఇప్పుడు ‘శశి’ పేరుతో హీరోగా ఓ సినిమా చేశాడు. ఈ సినిమా టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

chiranjeevi released adi hero venture sasi movie teaser
chiranjeevi released adi hero venture sasi movie teaser

సాయికుమార్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాను శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఆర్పీ వర్మ, రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాస్ నిర్మించారు. సురభి హీరోయిన్ గా నటించింది. చిరంజీవి అభిమాని అయిన ఆది.. తన కొత్త సినిమా ‘శశి’ ట్రైలర్ ను చిరంజీవితో రిలీజ్ చేయించాడు. ‘మన చివరి క్షణాలు చూస్తున్నప్పుడే మొదటి క్షణాలు గుర్తొస్తాయి’ అనే డైలాగ్ తో టీజర్ ప్రారంభమవుతోంది.కాలేజీ బ్యాక్ డ్రాప్, ప్రేమ, యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించారు. ఆది క్యారెక్టర్ స్టూడెంట్, రఫ్ గా, ప్రేమించిన అమ్మాయి సమస్యను పరిష్కరించే పాత్రలో రఫ్ గా కనిపించాడు.

యాక్షన్ నేపథ్యం కూడా ఉండటంతో యూత్ టార్గెట్ గా ఈ సినిమా తెరకెక్కించారని తెలుస్తోంది. న్యూటాలెంట్ ని ఎప్పుడూ ఎంకరేజ్ చేసే చిరంజీవి ఈ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఆదికి ప్రేమ కావాలి, లవ్లీ.. సినిమాలు శతదినోత్సవ సినిమాలయ్యాయి. తర్వాత వరుస ఫ్లాపులతో కాస్త డీలా పడ్డాడు. ఈ సినిమాపై ఆది కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు. ఈ సినిమాను ధియేటర్లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. టీజర్ లో సన్నివేశాలు ప్రెజంట్ ట్రెండ్ కు తగ్గట్టుగా ఉండడంతో సినిమా సక్సెస్ అయ్యేలా ఉందని చెప్పాలి.


Share

Related posts

ఆ ముగ్గురు దర్శకులతో చిరంజీవికి సరిపడలేదా..!?

Muraliak

దుబాయ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు..!!

sekhar

Samantha: సమంతపై తమిళుల ఆగ్రహం..! సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్

Muraliak