RRR: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. ఈ భారీ మల్టీస్టార్ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించగా.. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మించారు. ఆలియా భట్, అజయ్ దేవగణ్, శ్రియా సరణ్, సముద్రఖని, ఒలివియా మోరిస్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
యావత్ సినీ లోకం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఈ పాన్ ఇండియా మూవీ.. అన్ని అడ్డంకులను దాటుకుని ఎట్టకేలకు నేడు విడుదలైంది. ఓ చిన్న పాయింట్‌ని కథగా ఎంచుకొని, దానికి భావోద్వేగాలు రంగరించి రాజమౌళి కథనాన్ని నడిపించిన తీరు బాగుంటుంది. కొమరం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ పోటీ పడి నటించారు.
హీరోలిద్దరి నటన, యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్, ఇంటర్వెల్ ఎపిసోడ్, ఎమోషనల్ సీన్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వంటివి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో రిలీజ్ అయిన అన్ని చోట్ల పాజిటివ్ టాక్‌తో ఈ చిత్రం దూసుకుపోతోంది. అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ను వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి.. సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు.
`మాస్టర్ స్టోరీ టెల్లర్ రాజమౌళి నుంచి వచ్చిన మరో మాస్టర్ పీస్ ఆర్ఆర్ఆర్ చిత్రం. రాజమౌళి సినిమాటిక్ విజన్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ మొత్తానికి హ్యాట్సాఫ్` అంటూ చిరంజీవి ట్వీట్ చేయగా.. అది కాస్త ప్రస్తుతం వైరల్‌గా మారింది. మొత్తానికి చిరు ప్రశంసలు ఆర్ఆర్ఆర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచాయి.
#RRR is the Master Storyteller’s Master Piece !!
A Glowing & Mind blowing testimony to @ssrajamouli ’s Unparalleled Cinematic vision!
Hats off to the Entire Team!! 👏👏@RRRmovie@tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @OliviaMorris891 @DVVMovies
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 25, 2022