chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న సంగతి తెలిసిందే.. అందులో భాగంగా చిరంజీవి ఇచ్చిన ఓ తన సోదరుడు పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ మీద అనేక రకాల విమర్శలు వస్తూ ఉంటాయి కదా.. వాటిని విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అని ప్రశ్నించాగా.. చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి..

చిరంజీవి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ మీద అలాంటి విమర్శలు విన్నప్పుడు చాలా బాధ కలుగుతుందని.. వాడు నాకు బిడ్డలాంటి తమ్ముడు అని మెగాస్టార్ అన్నారు. పవన్ కళ్యాణ్ ని తన చేతులతో ఎత్తుకొని పెంచామని.. పవన్ కి నేను సురేఖ తల్లిదండ్రుల లాంటి వాళ్ళమని చెప్పారు. పవన్ ముందు నుంచి కూడా నిస్వార్ధంగా ఉంటాడు. తనకి డబ్బు మీద ఆశ లేదు, పదవీ కాంక్ష లేదు, తనకోసం ఎప్పుడూ ఆలోచించుకోకూడని వివరించారు. పవన్ ఏ రోజు కూడా సమయానికి భోజనం చేయడు. సరైన బట్టలు వేసుకోడు.. సమాజానికి ఏదో ఒక మంచి చేయాలని తపనతో అన్నీ వదిలేసిన యోగి లాంటివాడు.. చిత్తశుద్ధి, నిజాయితీ ఉన్న వ్యక్తి రాజకీయాలనే మురికికూపంలోకి వెళ్లాడని.. అక్కడ ఉన్న మురికి ప్రక్షాళన చేయాలనుకుంటున్నాడని తెలిపారు.
ఆ ప్రయత్నంలో కొంత మురికి తనకు కూడా అంటుకుంటుందని.. మురికి తీసే వాళ్లకు మురికి అంటుకోవడం సహజమే కదా.. మంచి మనసుతో ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం సహకరించాలని.. అలాంటి వారిని ఎంకరేజ్ చేయాలని కోరారు. కానీ పవన్ అనరాని మాటలు అన్నప్పుడు మాత్రం తనకు బాధ కలుగుతుందని.. ఇంకొక విషయం ఏమిటంటే.. పవన్ ను తిట్టిన వాళ్లే మళ్ళీ నా దగ్గరకు వచ్చి పెళ్లిళ్లకు, పేరంటాలకు పిలుస్తారని.. రమ్మని బతిమలాడతారని చిరు చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. నా తమ్ముడిని అన్ని మాటలు అన్న వాళ్లతో మళ్ళీ మాట్లాడాల్సి వస్తుందని చిరు ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి వారితో మళ్ళీ మాట్లాడాల్సి వస్తుందని.. ఆ విషయంలో నాకు బాధ కలుగుతుందని మెగాస్టార్ అన్నారు.