GodFather: చిరంజీవి కొత్త సినిమా “గాడ్ ఫాదర్” బ్లాక్ బస్టర్ కావడంతో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. దసరా పండుగ నేపథ్యంలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మలయాళం “లూసిఫర్” సినిమాకి రీమేక్ గా వచ్చినా గాని ఆ ఛాయలు ఎక్కడ కనబడకుండా తెలుగు నేటివిటీకి స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసి దర్శకుడు మోహన్ రాజా.. సినిమా నడిపించిన తీరు అత్యద్భుతం.
సినిమా ఫస్ట్ ఆఫ్ లో చిరంజీవిని చూపించిన విధానం స్టోరీని నడిపించే తీరు ప్రేక్షకులను డివియేట్ అవకుండా దర్శకుడు పనితీరు పట్ల సినిమా చూసిన ప్రేక్షకులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తెలుగు మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదలైన “గాడ్ ఫాదర్” అన్నిచోట్ల పాజిటివ్ టాక్ సొంతం చేసుకోంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా ప్రత్యేకమైన పాత్ర చేయడంతో హిందీ ప్రేక్షకులు “గాడ్ ఫాదర్” కి బ్రహ్మ రథం పడుతున్నారట. సల్మాన్ నటించిన పాత్రకి బాలీవుడ్ జనాలు ఫిదా అయినట్లు… అక్కడ భారీ ఎత్తున కలెక్షన్స్ వస్తూ ఉండటంతో హిందీలో నేటి నుండి మరో 600 స్క్రీన్ లు యాడ్ చేయించడానికి చిరంజీవి ముందడుగు వేశారు.
ఈ సినిమాలో చిరంజీవికి తోడు సల్మాన్ అతిథి పాత్ర చేయడంతో హిందీ ప్రేక్షకులు సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో థియేటర్ లు పెంచుతూ ఉండటంతో హిందీలో మరింతగా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఎందుకంటే “గాడ్ ఫాదర్” ప్రమోషన్ కార్యక్రమాలు ముంబైలో కూడా చేయడం జరిగింది. డాన్ పాత్రలో సల్మాన్ సినిమాలో కనిపించడంతో.. హిందీ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారట. ఉన్న మేరకు సినిమాలో సల్మాన్ ని అత్యద్భుతంగా డైరెక్టర్ చూపించారని.. మోహన్ రాజా పై సలూబాయ్ అభిమానులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఈ పరిణామంతో హిందీలో థియేటర్ లు పెంచడానికి “గాడ్ ఫాదర్” సినిమా యూనిట్ రెడీ అయింది.