ప్రేమ కథ నేపథ్యంలో సినిమాలు తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ డైరెక్టర్ హాను రాఘవపూడి తీసిన “సీతా రామం” బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 75 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి దూసుకుపోతుంది. హిందీలో వచ్చే నెలలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా చూసిన చాలామంది ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సినిమా యూనిట్ ని పొగుడుతూ వస్తున్నారు.
చక్కటి ప్రేమ కావ్యం అంటూ మొన్న మధ్య మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు “సీతా రామం” యూనిట్ మొత్తాన్ని ప్రశంసించారు. తాజాగా ఈ జాబితాలోకి మెగాస్టార్ చిరంజీవి కూడా జాయిన్ అయ్యారు. “సీతా రామం” పై తనదైన శైలిలో పొగడ్తల వర్షం కురిపిస్తూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టడం జరిగింది. ‘సీతారామం’ చూశాను. ఒక చక్కటి ప్రేమకావ్యం చూసిన అనుభూతి. ముఖ్యంగా ఎంతో విభిన్నమైన స్క్రీన్ ప్లే తో ఈ ప్రేమ కథని ఆవిష్కరించిన విధానం ఎంతోగానో నచ్చింది.
మనసులపై చెరగని ముద్ర వేసే ఇలాంటి చిత్రాన్ని ఎంతో ఉన్నతమైన నిర్మాణ విలువలతో నిర్మించిన అశ్వినీదత్ గారికి, స్వప్నా దత్, ప్రియాంకా దత్ లకు, ఒక ప్యాషన్ తో చిత్రీకరించిన దర్శకుడు హను రాఘవపూడికి, కలకాలం నిలిచే సంగీతాన్ని అందించిన విశాల్ చంద్రశేఖర్ కి, అన్నిటికన్నా ముఖ్యంగా సీతా-రామ్ లుగా ఆ ప్రేమకథ కి ప్రాణం పోసిన మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ లకు, సూత్రధారి పాత్రని పోషించిన రష్మిక మందన్న కి మొత్తం టీం అందరికీ నా శుభకాంక్షలు! ప్రేక్షకుల మనసులు దోచిన ఈ చిత్రం మరెన్నో అవార్డులను, రివార్డులను జాతీయ స్థాయిలో గెలవాలని మనస్పూర్తి గా అభిలషిస్తున్నాను..అంటూ చిరంజీవి అభినందించారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!