NewsOrbit
సినిమా

25 ఏళ్ల ‘రిక్షావోడు’.. చిరంజీవికి మరో టర్నింగ్ పాయింట్

chiranjeevi starrer rickshavodu completes 25 years

మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఫ్యాన్స్ కి పండగ. ఆరు పాటలు, అయిదు ఫైట్లు, మాస్ సన్నివేశాలు, మేనరిజమ్స్.. ఇవే ఉంటాయి. చిరంజీవి సినిమాపై సగటు తెలుగు ప్రేక్షకుడి ఆలోచనలు ఇవే. ఈ అంశాలే చిరంజీవిని మెగాస్టార్ ను చేశాయి. నెంబర్ వన్ హీరోగా ఇప్పటికీ నిలబెట్టాయి. అయితే.. అప్రతిహతంగా కొనసాగుతున్న ఆయన కెరీర్లో చిన్న కుదుపు. రెగ్యులర్ మాస్ అంశాల్లో పడి కథ, కథనంపై పట్టు కోల్పోయారు. దీంతో వరుస ఫ్లాపులు. నేటికి సరిగ్గా 25 ఏళ్ల క్రితం 1995 డిసెంబర్ 14న విడుదలైన ‘రిక్షావోడు’ చిరంజీవిని ఆలోచనలో పడేసింది. తాను వెళ్లాల్సిన మరో దారిని చూపించింది.

chiranjeevi starrer rickshavodu completes 25 years
chiranjeevi starrer rickshavodu completes 25 years

1992లో ఘరానామొగుడు తర్వాత 1996లో చేసిన రిక్షావోడు వరకూ చేసిన 8 సినిమాల్లో కేవలం ముఠామేస్త్రి, అల్లుడా మజాకా మాత్రమే హిట్ అయ్యాయి. అన్నీ కమర్షియల్ ఫార్మాట్లే. ఏ జోనర్ తనను అత్యున్నత స్థానానికి తీసుకెళ్లిందో అదే ఫార్మాట్ చిరంజీవికి ప్రతిబంధకంగా మారింది. తన సినిమా అంటే ఫైట్లు, పాటలు, మాస్, దాదాపు ప్రతి ఫ్రేములో తానుండాలి.. వీటన్నింటినీ పక్కకు పెట్టారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన రిక్షావోడు ఫ్లాప్ తో ఏకంగా ఏడాది పాటు చిరంజీవి సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆయన కెరీర్లో అప్పటివరకూ ఎప్పుడూ సినిమా రాని ఏడాది లేదు. కానీ.. 1996లో ఏ సినిమా చేయకుండా ఎటువంటి సినిమా చేయాలో ఆలోచించారు.

మళయాళంలో హిట్ అయిన హైఎండ్ సిస్టర్ సెంటిమెంట్ మూవీ ‘హిట్లర్’ రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యారు. దర్శకుడిగా సాఫ్ట్, ఫ్యామిలీ మూవీస్ డైరక్టర్ గా ముత్యాల సుబ్బయ్యను ఎంచుకున్నారు. ఇవన్నీ చిరంజీవి సినిమాకు ఉండాల్సినవి కాదు.. ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేసేవి కావు. కానీ.. చిరంజీవి ఆలోచన, అనుభవం వర్కౌట్ అయ్యాయి. హిట్లర్ హిట్. అదే ఫార్ములాను ఉపయోగిస్తూ.. కథ, కథనం, తన మార్క్ అంశాలతో వరుసగా చేసిన మాస్టర్, బావగారూ.. బాగున్నారా, చూడాలని వుంది, స్నేహం కోసం.. ఇలా వరుస హిట్లతో దూసుకుపోయారు. ‘రిక్షావోడు’ ఫ్లాప్ కూడా చిరంజీవికి అలా కలిసొచ్చిందనే చెప్పాలి.

author avatar
Muraliak

Related posts

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Karthika Deepam 2 April 24 2024: దీప ని ఆపిన సుమిత్ర… నరసింహని ఘోరంగా ఛీ కొట్టిన శోభ, కార్తీక్.. అంతు చూస్తా అంటూ సవాల్..!

Saranya Koduri

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Brahmamudi April 24 2024 Episode 392: గుడిలో అనామిక రచ్చ.. అనామిక మీద ఫైరైన కనకం.. రుద్రాణి ప్లాన్ ను తిప్పి కొట్టాలనుకున్న అప్పు..

bharani jella

 Trinayani April 24 2024 Episode 1221: గాయత్రి జాడ తెలుసుకోవాలనుకున్న తిలోత్తమ, అద్దంలో కనపడిన హాసిని..

siddhu

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari April 24 2024 Episode 453: మురారి మనసు మార్చిన ముకుంద.. కృష్ణ కి దూరంకానున్న మురారి..ఆదర్శ్ లవ్ ప్రపోజల్..

bharani jella

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri