సినిమా

Aacharya: అటువంటి స్క్రిప్టుతో వస్తే.. మళ్ళీ నా విశ్వరూపం చూపిస్తా.. హరీష్ కి చిరంజీవి బంపర్ ఆఫర్..!!

Share

Aacharya: “ఆచార్య” మరి కొద్ది గంటల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. గతంలో మాదిరిగా క్షణాల మధ్య కాకుండా చాలా వరకు ఇంటర్వ్యూలు తో కానిచ్చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే.. పలు టాప్ యాంకర్లకు ఇంటర్వ్యూ ఇచ్చిన “ఆచార్య” తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ కి చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల.. ఇంటర్వ్యూ ఇచ్చారు. కోకాపేటలో “ఆచార్య” .. సినిమా షూటింగ్ జరిగిన సెట్ లో ఇంటర్వ్యూ జరిగింది.

Chiru Surprises Harish With 'Rowdy Alludu' Request - Movie Newsఈ సందర్భంగా ఫుల్ ఎనర్జీతో హరీష్ శంకర్ ఒకపక్క కామెడీ పండిస్తూ మరోపక్క “ఆచార్య” సినిమా విశేషాలు.. డైరెక్టర్ హీరోల దగ్గర నుండి రాబట్టాడు. ఇంటర్వ్యూ లో భాగంగా చిరంజీవికి ఒక ఆసక్తికరమైన ప్రశ్న హరీష్ శంకర్ వేయడం జరిగింది. అదేమిటంటే.. గతంలో చిరంజీవి నటించిన అనేక సినిమాలలో.. మళ్లీ ఇప్పుడు రీమేక్ చేయాల్సి వస్తే ఏది సెలెక్ట్ చేసుకుంటారు అని ప్రశ్నించారు. దానికి చిరంజీవి సమాధానమిస్తూ.. పొలిటికల్ రంగంలో తొమ్మిది సంవత్సరాలు ఆ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చాక నాలుగు సంవత్సరాల కాలంలో హాస్యానికి చాలా దూరం అయ్యాను అన్న ఫీలింగ్ వచ్చింది. Filmmaker Harish Shankar receives heartwarming birthday wishes | Telugu Movie News - Times of India

దీంతో ఒక రోజు అద్దం ముందు నిలబడి నాలో హాస్య గ్రంధులు చచ్చిపోయామో అని నాకు నేను.. ప్రశ్నించుకున్నాను. రీ ఎంట్రీ తర్వాత చేసిన ఖైదీ నెంబర్ 150, సైరా.. ఇప్పుడు “ఆచార్య” చాలావరకు సీరియస్ ఎలిమెంట్స్ ఉన్న స్టోరీలు. ఇటువంటి నేపథ్యంలో నేను నటించిన సినిమాలలో… దొంగ మొగుడు లేదా రౌడీ అల్లుడు ఇలాంటి సినిమాలను మళ్లీ రీమేక్ చేయాలని ఉంది అని తెలిపారు. అటువంటి స్క్రిప్ట్ తో వస్తే మళ్లీ నా విశ్వరూపం చూపిస్తా అని చిరంజీవి చెప్పుకొచ్చారు. అంతమాత్రమే కాదు ఇలాంటి స్క్రిప్ట్ నువ్వు తీసుకొస్తే గ్యారెంటీగా చేస్తా అంటూ హరీష్ శంకర్ కి చిరంజీవి బంపర్ ఆఫర్ ఇచ్చారు. చిరంజీవి ఇచ్చిన ఆఫర్ కి హరీష్ శంకర్ చేతులెత్తి మొక్కడు.


Share

Related posts

Akhil: మరో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ని లైన్ లో పెట్టిన అఖిల్..??

sekhar

RRR: బ్రేక్ ఈవెన్ దిశ‌గా `ఆర్ఆర్ఆర్‌`.. ఇంకా ఎంత రావాలో తెలుసా?

kavya N

బ్రేకింగ్: ప్రభాస్ ను మాస్క్ పెట్టుకోమంటూ అస్సాం పోలీసుల మెసేజ్

Vihari
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar