Chiranjeevi: ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి `ఆచార్య` ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అలాగే మరోవైపు ఈయన వరుస ప్రాజెక్ట్స్‌ను టేకప్ చేస్తూ కెరీర్ పరంగా జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నాడు. ఈయనతో సినిమాలు చేసేందుకు దర్శనిర్మాతలు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే ఇలాంటి తరుణంలో చిరు ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడట.
అదేంటంటే.. రెమ్యునరేషన్ లేకుండా ఫ్రీగా ఓ సినిమా చేయాలని చిరు భావిస్తున్నారట. అయితే ఈ సినిమా ఎవరి కోసమో కాదు.. ఆయన పెద్ద కుమార్తె సుష్మిత కోసమని తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. క్యాస్యూమ్ డిజైనర్‌గా రాణిస్తున్న సుష్మిత కొణిదెల ఇటీవలె సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
భర్త విష్ణుప్రసాద్‌తో కలసి `గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్` నిర్మాణ సంస్థను నెలకొల్పిన ఆమె.. తన బ్యానర్‌పై సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లను కూడా నిర్మిస్తోంది. తాజాగా ఈమె నిర్మాణంలో రూపుదిద్దుకున్న `శ్రీదేవి శోభన్ బాబు` త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదిలా ఉంటే.. సుష్మిత తండ్రి సినిమాను కూడా ప్రొడ్యూస్ చేయాలని భావిస్తుందట.
అందుకు చిరు కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడని.. ప్రస్తుతం సుష్మిత మంచి దర్శకుడిని వెతికే పనిలో పడిందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండానే కూతురికి గిఫ్ట్‌లాగా చిరు ఈ సినిమాను చేయాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ వార్తలే నిజమైతే.. మెగా డాటర్ సుష్మిత నిర్మాతగా సెటిల్ అయినట్టే అని అంటున్నారు.