సినిమా

Chiranjeevi: `ఆచార్య‌`తో భారీ నష్టాలు.. డిస్టిబ్యూటర్ల కోసం చిరు కీల‌క నిర్ణ‌యం!

Share

Chiranjeevi: మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన `ఆచార్య‌` ఎట్ట‌కేల‌కు ఏప్రిల్ 29న విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న త‌న‌యుడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఇందులో హీరోలుగా న‌టించ‌గా.. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ల‌పై నిరంజన్‌ రెడ్డి, అన్వేష్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా మెర‌వ‌గా.. సోనూ సూద్, జిషు సేన్‌గుప్తా విల‌న్లుగా చేశారు.

భారీ అంచనాల మధ్య వ‌చ్చిన ఈ చిత్రం తొలి షో నుంచే నెగ‌టివ్ టాక్ సొంతం చేసుకుంది. సాధార‌ణ ప్రేక్ష‌కుల‌నే కాదు అభిమానుల‌ను సైతం ఈ మూవీ మెప్పించ‌లేక‌పోయింది. ఎంత పెద్ద స్టార్లున్నా.. స‌రైన కంటెంట్ లేక‌పోవ‌డంతో ఆచార్య‌పై నెటిజ‌న్లు తెగ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే టాక్ ఎలా ఉన్నా మొద‌టి రోజు మంచి ఓపెనింగ్స్ సొంతం చేసుకున్న ఈ మెగా మ‌ల్టీస్టార‌ర్‌.. రెండో రోజు నుండి మాత్రం డ‌ల్ అయిపోయింది.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 131.20 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఆచార్య సినిమా రూ.132.50 కోట్ల టార్గెట్‌తో బ‌రిలోకి దిగింది. మొద‌టి ఐదు రోజుల్లో రూ. 47.32 కోట్ల షేర్‌ను మాత్ర‌మే రాబ‌ట్ట‌గా.. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా రూ. 85.18 కోట్ల కలెక్షన్స్ ని వ‌సూల్ చేయాల్సి ఉంటుంది. కానీ, ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఆ రేంజ్‌లో క‌లెక్ష‌న్స్‌ను కొల్ల‌గొట్ట‌డం అసాధ్యం.

ఆచార్యతో డిస్టిబ్యూట‌ర్ల‌కు భారీ న‌ష్టాలు వాటిల్ల‌డం ఖాయ‌మైంది. అయితే న‌ష్టాల్లో మునిగిన డిస్టిబ్యూట‌ర్ల‌కు కోసం చిరు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. అదేంటంటే.. త‌న త‌దుప‌రి చిత్ర‌మైన `గాడ్ ఫాద‌ర్‌` థియేట్రిక‌ల్ హ‌క్కుల విష‌యంలో డిస్కౌంట్ ఇస్తామ‌ని చిరంజీవి ఆచార్య డిస్టిబ్యూట‌ర్ల‌కు హామీ ఇచ్చార‌ట‌. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాల్సి ఉంది. మ‌ల‌యాళంలో హిట్టైన `లూసిఫర్`కు గాడ్ పాద‌ర్ రీమేక్‌. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.


Share

Related posts

కన్‌ఫర్మ్ : కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ..!

GRK

Karunakar : వీళ్ళిద్దరు మళ్ళీ టాలీవుడ్ లో సక్సెస్ ట్రాక్ ఎక్కుతారా..?

GRK

జబర్దస్త్ సెట్ పై ఆమెకి నిజంగానే ముద్దు పెట్టిన కమెడియన్..! ఒక్కసారిగా అంతా షాక్

arun kanna
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar