మెగాస్టార్ చిరంజీవి ఇండిపెండెన్స్ డేను టార్గెట్ చేసుకున్నారు. ఏంటా టార్గెట్? ఎందుకని అనుకుంటున్నారా? తన తదుపరి సినిమా కోసం. చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. నిజానికి ఈ సినిమా షూటింగ్‌ను నవంబర్లోనే స్టార్ట్ చేసి వచ్చే సమ్మర్లో సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ.. సైరా చిత్రీకరణ ఆలస్యం కావడం తదితర కారణాలతో సినిమా డిసెంబర్లో షూటింగ్‌ను ప్రారంభించనుంది. కాబట్టి సినిమాను సమ్మర్లో విడుదల చేయలేరు. సినిమా విడుదల ఆలస్యం కానుంది. లేటెస్ట్ సమాచారం మేరకు సినిమాను ఆగస్ట్ 14న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట.
previous post
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!