సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నిహారిక కొణిదెల పెళ్లి పెళ్లి ముచ్చట్లు. అంగరంగ వైభవంగా నిహారిక పెళ్లి ముగిసింది. మెగా ఫ్యామిలీ మొత్తం పెళ్లికి హాజరై సందడి చేశారు. ఎటు చుసిన మెగాస్టార్ చిరంజీవి హైలైట్ అవుతున్నారు.
చిత్ర పరిశ్రమలోకి ఎలాంటి సపోర్ట్ లేకుండా టాలీవుడ్ అగ్ర కథానాయకుడుగా ఎదిగారు మెగాస్టార్ చిరంజీవి. ఎలాంటి అడ్డంకులు లేకుండా దాదాపు 155 చిత్రాల్లో నటించారు. ఆరు పదుల వయస్సులో కూడా ఉత్సాహంగా నటిస్తూ.. ప్రేక్షలుకులను అలరిస్తున్నారు. ఇది ఇలా ఉంటె ఇంతకీ మెగాస్టార్ పెళ్లి ఎలా జరిగిందో తెలుసా ?? తెలుసుకోవాలంటే మొత్తం చదవండి.
ఐదుగురు కుర్రాళ్లలో ఒక కుర్రాడిగా “మన ఊరి పాండవులు” సినిమాతో తెరంగేట్రం చేశారు మన మెగాస్టార్. ఆ సినిమాలో విలన్ అసిస్టెంట్ గా అల్లు రామలింగయ్య కనకయ్య పాత్ర పోషించారు. ఆ సినిమా షూటింగ్ లో అల్లు రామలింగయ్య చిరంజీవిని దగ్గరగా గమనించారు. తన గుణగణాలు, నటన అన్ని బాగుండటంతో తన కుమార్తె సురేఖను చిరంజీవికి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. దాంతో చిరంజీవితో మరింత సన్నిహితంగా మెలిగారు. ఒకానొక సందర్భంలో రామలింగయ్య మందు తాగుతూ చిరంజీవిని కూడా తాగమంటే అలవాటు లేదని చెప్పారంట.
చిరంజీవి తన స్నేహితుడు సత్యనారాయణ కలుసుకోవడానికి అప్పుడప్పుడు అల్లు రామలింగయ్య ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. అలా అల్లు రామలింగయ్య భార్య కూడా చిరంజీవిని చూసి తమ అమ్మాయికి, చిరంజీవికి ముడి వేస్తే బాగుంటుందని అల్లు రామలింగయ్యకు చెప్పటం.. సత్యనారాయణ పిలిచి చిరంజీవి గురించి ఆరాతీయటం చేశారు. మంచివాడే అని తెలియటంతో తన కొడుకు అరవిందుకు ఈ విషయం చెప్పి.. ఇతర విషయాలు కనుక్కోమని సూచించారట.
ఇరు కుటుంబాలతో సంబంధం ఉన్న జయకృష్ణ గారిని కలిసి అరవింద్ విషయం చెప్పటంతో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పెళ్లిచూపులు జరగడం.. సురేఖ చిరంజీవి ఒకరినొకరు ఇష్టపడటం.. పెళ్ళి జరగటం. ఇదండీ చిరంజీవి సురేఖల పెళ్లి విషయం.