Chiranjeevi: మూడు పండుగలకు థియేటర్ లలో సందడి చేయనున్న చిరంజీవి..??

Share

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) వయసు మీద పడుతున్న సినిమాలు ఒప్పుకోవడంలో.. కుర్ర హీరోలు కూడా చిరంజీవి స్పీడ్ అందుకోలేకపోతున్నారు. రాజకీయాలనుండి రియంట్రి ఇచ్చిన తర్వాత ప్రారంభంలో వివి వినాయక్(VV Vinayak) దర్శకత్వంలో “ఖైదీ నెంబర్ 150”, ఆ తర్వాత సురేందర్ రెడ్డి(Surendar Reddy) దర్శకత్వంలో “సైరా నరసింహారెడ్డి” చేసిన చిరంజీవి రెండు సినిమాలతో మంచి విజయాలు అందుకోవటం జరిగింది. ఆ తర్వాత వెంటనే కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో “ఆచార్య”(Acharya) సినిమా స్టార్ట్ చేయగా షూటింగ్ 30% కంప్లీట్ కాక మహమ్మారి కరోనా ఎంట్రీ ఇవ్వడంతో.. షూటింగ్ లు ఆగిపోవడం ఆ తర్వాత పరిణామాలు మారడం మొత్తానికి “ఆచార్య” ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదల చేసి ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు చిరంజీవి నెక్స్ట్ రాబోయే మూడు అతిపెద్ద పండుగలను టార్గెట్ చేసుకొని సినిమాలు విడుదల చేస్తున్నట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది. ఇప్పటికే మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళం సూపర్ డూపర్ హిట్ సినిమా “లూసిఫర్” తెలుగులో “గాడ్ ఫాదర్”(God Father) గా చేయడం తెలిసింది. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్ చేసి దసరా పండుగకు సినిమా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు సల్మాన్ ఖాన్ ఇంకా డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా నటిస్తున్నారు.

సల్మాన్ చేసేది అతి పెద్ద పాత్రని సమాచారం. ఇక ఆ తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో చేస్తున్న “బోలా శంకర్” ఉగాది పండుగ కానుకగా ఏప్రిల్ రెండవ తారీకు విడుదల చేయనున్నారు. ఇక బాబీ దర్శకత్వంలో చేయబోయే సినిమా సంక్రాంతి పండుగకు కానుకగా రిలీజ్ చేయనున్నారు. మొత్తం మీద చూసుకుంటే తెలుగులో మూడు అతిపెద్ద మూడు భారీ పండుగలకు చిరంజీవి తన మూడు సినిమాలు రిలీజ్ చేసి ప్రేక్షకులను అలరించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం “గాడ్ ఫాదర్” సినిమాకి సంబంధించి… బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఒక సాంగ్ మినహా అది కూడా సల్మాన్ ఖాన్ తో చిరంజీవి స్టెప్ లు వేసే సాంగ్ మినహా మిగతా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిందట.


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

25 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

34 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

1 గంట ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

1 గంట ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago