Veeraiah: సంక్రాంతి వస్తుందంటే సినీ ప్రేక్షకులకి పండగే.. పెద్ద పెద్ద సినిమాలన్నీ అప్పుడే రిలీజ్ అవుతాయి . ఇక స్టార్ హీరోలు అందరూ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతారు. అయితే ఈ ఏడాది ఈ బరిలోకి మెగాస్టార్ చిరంజీవి ,బాలకృష్ణ దిగుతుండడంతో మరింత రసవత్తరంగా మారింది.. ప్రేక్షకుల్లో ఉన్నంత వేడి ప్రమోషన్స్ లో కనిపించడం లేదు.. ఇంతకీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనైనా సమంగానే చేస్తారా లేదంటే ఏమైనా స్పెషల్స్ ఉన్నాయా.. అని ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..

బాలకృష్ణ నటించిన వీరసింహా రెడ్డి జనవరి 12న వస్తుండగా.. చిరంజీవి వాల్తేరు వీరయ్య 13న బరిలోకి దిగుతుంది. అయితే టాలీవుడ్ టాప్ స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి బాక్సాఫీసు ముందుకు వస్తున్నపుడు ప్రమోషన్స్ లో ఎక్కడా ఆ వేడి లేదు.. చప్పచప్పగా ఉంది.. చాలా కూల్ గా, బ్యాలెన్స్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు అందుకు కారణం ఈ రెండు సినిమాలు మైత్రీ మూవీ మేకర్స్ నుంచి వచ్చినవే.. అందుకే చాలా బ్యాలెన్స్డ్గా ఈ సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్..
ఇక వాల్తేరు వీరయ్య వీర సింహారెడ్డి సినిమాల ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా ఇలాగే బ్యాలెన్స్ గా జరిపేయాలని ఆలోచనలో ఉన్నారట మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటివరకు రెండు చిత్రాల నుంచి విడుదల చేసిన పాటలను రోజు విడిచి రోజు ఒకొక్కటిగా విడుదల చేశారు. అలాగే వీరసింహా టైటిల్ ని కర్నూల్ లో ఒక చిన్న ఈవెంట్ లా నిర్వహించి విడుదల చేశారు. ఇక వాల్తేరు వీరయ్య పోర్ట్ సెట్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ తో బ్యాలెన్స్ చేయించారు. అలాగే రెండు ఫ్యాన్ మీట్లు పెట్టారు. ఒక్కటేమిటి ఈ రెండు సినిమాలలో టెక్నీషియన్స్ డాన్స్ మాస్టర్స్ ఫైట్ మాస్టర్స్ ఆఖరికి హీరోయిన్ కూడా ఒకరే.. ఇక ఈ సినిమాల నిర్మాతలు కూడా ఒకటి తక్కువ ఎక్కువ అని కాకుండా రెండూ అద్భుతమని చాలా జాగ్రత్తగా పొదుపుగా మాట్లాడి ఎవరి అభిమానులు మనోభాబాలు దెబ్బతినకుండా ఆచితూచి మాట్లాడుతున్నారు. ఈ రెండు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇంతే బ్యాలెన్స్ గా చేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది..