Chiranjeevi: ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. దగ్గుబాటి రానా చిన్ననాటి నుండి మంచి ఫ్రెండ్స్ అని అందరికీ తెలుసు. ఇద్దరూ కూడా ఒకే స్కూల్ లో చదువు కోవడం జరిగింది. చరణ్ కూడా చాలా వేదికలపై రానా తన బెస్ట్ ఫ్రెండ్ అని తెలియజేయడం జరిగింది. ఒకానొక టైంలో ఓ అవార్డు కార్యక్రమంలో రానా కి వచ్చిన ఆ అవార్డు చరణ్ తీసుకోవడానికి వచ్చినప్పుడు.. అప్పట్లో స్కూల్ టైం లో తన లంచ్ బాక్స్ రానా తినేసేవాడు.. అందువల్లే నాకంటే రానా చాలా హైట్ అని చరణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
ఇదిలా ఉంటే “ఆహా” ఓటిటిలో తెలుగు ఇండియన్ ఐడిల్ సూపర్ సింగర్ కార్యక్రమం చేపట్టడం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సంబంధించి ఫైనల్ ఎపిసోడ్ కి చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రావడం జరిగింది. ఇక ఇదే సమయంలో రానా, సాయి పల్లవి కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా రానా పదవ తరగతి గురించి స్టేజిపై మాట్లాడుతుంటే పదకొండవ తరగతిలో మీరు ఏం చేశారో నేను చెబుతాను అంటూ చిరంజీవి సరికొత్త విషయాన్ని ప్రోమోలో తెలియజేశారు. పదకొండవ తరగతిలో చరణ్ గదిలో కిటికీ పైన ఉండే గ్రీల్స్ రానా తీసేసాడు అంటూ.. ఆ చిలిపి విషయాన్ని చిరంజీవి ఈ కార్యక్రమంలో బయట పెట్టడం జరిగింది.
చిరంజీవి చెప్పిన వెంటనే రానా ఒక్కసారిగా వెనక్కి తిరిగి.. సైలెంట్ అయిపోయారు. దీంతో ఆహా.. తెలుగు ఇండియన్ ఐడిల్ ఫినాలే కి సంబంధించి.. లేటెస్ట్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సెమీ ఫైనల్ కి నటసింహం బాలయ్య బాబు చీఫ్ గెస్ట్ గా వచ్చారు. తన అదిరిపోయే టైమింగ్ తో… డైలాగులతో బాలయ్య చెలరేగిపోయారు. ఆ ఎపిసోడ్ ఇటీవల బాలయ్య పుట్టినరోజునాడు జూన్ పదవ తారీకు ఆహా.. స్ట్రీమింగ్ చేయడం జరిగింది. దాదాపు 90 రోజులకు పైగానే.. తెలుగు ఇండియన్ ఐడిల్ షోలో చాలామంది సంగీత కళాకారులు పాల్గొనడం జరిగింది. ఈషో చాలా మందిని ఆకట్టుకుంది. ఏకంగా చిరంజీవి షో లోకి ఎంట్రీ ఇచ్చాక.. అతిథిగా కాదు అభిమానిగా వచ్చినట్లు చెప్పటం విశేషం.
Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…