Waltair Veerayya: నవంబర్ 23వ తారీకు సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు “వాల్తేరు వీరయ్య” ఫస్ట్ సింగిల్ సాంగ్.. రిలీజ్ అవుతున్నట్లు చెప్పిన టయానికే సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. “బాస్ పార్టీ” టైటిల్ తో రిలీజ్ అయిన ఈ సాంగ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. గతంలో ముఠామేస్త్రి, అన్నయ్య.. అందరివాడు సినిమాలలో కనిపించిన చిరంజీవి లుంగీ డాన్స్ లుక్ .. తరహాలో మరోసారి ఈ సాంగ్ కనిపించడం జరిగింది. నోట్లో బీడీ పెట్టుకుని చిరు మాస్ స్టెప్పులు వేసి అభిమానులను ఆకట్టుకోవటం జరిగింది.
సినిమాలో ఇది స్పెషల్ సాంగ్. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటాల అదిరిపోయే స్టెప్పులతో చిరుతో ఈ సాంగ్ లో చెలరేగిపోయింది. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తన బానీలతో తగిన న్యాయం చేశారు. సంక్రాంతి పండుగకి.. “వాల్తేరు వీరయ్య” రిలీజ్ కానుంది. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నారు. త్వరలోనే రవితేజ కి సంబంధించిన లుక్ రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ రెడీ అవుతుంది. ఇక డిసెంబర్ రెండో వారం నుండి.. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు.
చాలాకాలం తర్వాత రవితేజ చిరంజీవి కలిసిన నటిస్తూ ఉండటంతో “వాల్తేరు వీరయ్య” పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాని చాలా అద్భుతంగా డైరెక్టర్ బాబీ చిత్రీకరించినట్లు ఇండస్ట్రీలో… వార్తలు వైరల్ అవుతున్నాయి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ కమర్షియల్ తరహాలో.. ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే విధంగా.. చిరు కామెడీ ఫ్లేవర్ తో.. వాల్తేరు వీరయ్య ఉండబోతున్నట్లు సమాచారం. చిరంజీవి సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక రవితేజ సరసన్నా కేథరిన్ తెరిసా హీరోయిన్ గా చేసినట్లు సమాచారం.
Boss ochindu, kick ichindu 💥#BossParty from #WaltairVeerayya hits 4M+ views 🔥
– https://t.co/9kC65KkoBpMegastar @KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @UrvashiRautela @ThisIsDSP @AzizNakash @Sekharmasteroff @HariPriyaSinger @SonyMusicSouth pic.twitter.com/A3KQsQgrRf
— Mythri Movie Makers (@MythriOfficial) November 23, 2022