Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి “వాల్తేరు వీరయ్య” సంక్రాంతి ఛాంపియన్ గా నిలిచింది. ఈ సినిమాతో పాటు బాలకృష్ణ నటించిన “వీరసింహారెడ్డి” విడుదలైన గాని.. చిరంజీవి సినిమా అందరిని అన్ని రకాలుగా ఆకట్టుకుని కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. పైగా మాస్ మహారాజ రవితేజ సినిమాలో కీలక పాత్ర పోషించడంతో… సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అన్నదమ్ముల సెంటిమెంటుతో పాటు కామెడీ ఇంకా యాక్షన్ అన్ని రకాలుగా సంక్రాంతి బరిలో… దిగి టాలీవుడ్ బాక్సాఫీస్ నీ షేక్ చేసి పడేసింది. మూవీ విడుదలైన ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹157.15కోట్లు(గ్రాస్)… వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో ₹121.35 కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది. అమెరికాలో రెండు మిలియన్ డాలర్ల మార్క్ అందుకోవటం జరిగింది.
ఈ యాడాదిలో అమెరికాలో అత్యధిక వసూలు రాబట్టిన సినిమాగా వాల్తేరు వీరయ్య నిలిచింది. పండగ అయినా గాని రెండు తెలుగు రాష్ట్రాలలో… హౌస్ ఫుల్ కలెక్షన్ లతో దూసుకుపోతోంది. దీంతో సోషల్ మీడియాలో సంక్రాంతి మొగుడు “వాల్తేరు వీరయ్య” అంటూ హ్యాష్ ట్యాగ్ తో మెగా ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే “వాల్తేరు వీరయ్య” సినిమా విజయం తర్వాత “భోళా శంకర్” సెట్ కి చిరంజీవి రావడంతో గ్రాండ్ వెల్కమ్ పార్టీ డైరెక్టర్ మెహర్ రమేష్ నిర్వహించారు.
ఈ క్రమంలో చిరంజీవితో కేక్ కట్ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ కీర్తి సురేష్ కూడా పాలు పంచుకుంది. “భోళా శంకర్”లో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తోంది. కాగా ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత వీకెండ్ రిలీజ్ కావటం తర్వాత సంక్రాంతి పండుగ ఇప్పుడు మళ్లీ వీకెండ్ రావడంతో మరింతగా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇది ఏమైనా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఈ ఏడాది స్టార్టింగ్ లో “వాల్తేరు వీరయ్య” రూపంలో భారీ హిట్టు పడిందని చెప్పవచ్చు.
Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!