Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా “వాల్తేరు వీరయ్య” జనవరి 13వ తారీకు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్. మాస్ మహారాజ రవితేజ కీలకపాత్రలో కనిపిస్తున్నారు. ఈరోజు విశాఖపట్నం లో సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి థియేట్రికల్ ట్రైలర్.. ఈరోజు సాయంత్రం 6: 03 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు.. మేకర్స్ తెలియజేశారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన పాటలు మరియు ఫోటోలు చిరంజీవి మరియు రవితేజ ఇంట్రడక్షన్ వీడియోలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్లు మేకర్స్ తెలియజేయడం జరిగింది. చిరంజీవి కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా శంకర్ దాదా ఎంబిబిఎస్. ఆ తరహా కామెడీ జోనర్ ఈ సినిమాలో ఉంటుందని స్వయంగా చిరంజీవి తెలియజేయడంతో.. “వాల్తేరు వీరయ్య” చూడటానికి అభిమానులు ఆతృతగా ఉన్నారు. గత ఏడాది “ఆచార్య” తో అట్టర్ ప్లాప్ పుచ్చుకున్న చిరు తర్వాత “గాడ్ ఫాదర్” సినిమాతో మంచి విజయం అందుకున్నారు. ఇప్పుడు కొద్ది నెలల గ్యాప్ లోనే మళ్లీ “వాల్తేరు వీరయ్య” తో సంక్రాంతి బరీలో దిగటంతో ఏ మేరకు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.

పైగా “అన్నయ్య” వంటి సినిమా తర్వాత రవితేజ చిరంజీవి 20 సంవత్సరాల తర్వాత కలిసి నటిస్తున్న సినిమా కావటంతో… అటు రవితేజ ఫాన్స్ కూడా “వాల్తేరు వీరయ్య” పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈరోజు సాయంత్రం విశాఖపట్నంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు భారీ ఎత్తున ఇండస్ట్రీ ప్రముఖులు వస్తున్నారు. కాగా “వాల్తేరు వీరయ్య”తో పాటు “వీరసింహరెడ్డి” సినిమా విడుదల అవ్వుతోంది. చాలాకాలం తర్వాత బాలకృష్ణ…చిరంజీవి పోటి పడుతుండటంతో ఈ పండుగ సీజన్ చాల ఆసక్తికరంగా మారింది.