25.7 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Chiranjeevi: సీనియర్ కెమెరామెన్ కు భారీగా ఆర్థిక సహాయం చేసిన చిరంజీవి..!!

Share

Chiranjeevi: గత కొద్ది సంవత్సరాల నుండి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చిరంజీవి భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కరోనా కష్ట కాలంలో సినీ కార్మికులకు నిత్యవసర వస్తువులు ఇంకా ఉచితంగా వ్యాక్సినేషన్ కూడా చేయించడం జరిగింది. ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా చిరంజీవి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ త్వరలో హాస్పిటల్ కూడా సినీ కార్మికులకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇదే సమయంలో ప్రజలు నన్ను ఎంతగానో అభిమానించారు. సమాజానికి నా వంతుగా.. మరింత సహాయ పడాలని.. అనుకుంటున్నట్లు కూడా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఈ క్రమంలో ఇటీవల ఇండస్ట్రీలో చాలామంది సీనియర్ నటీనటులకు అనేక రూపాలలో ఆర్థిక సహాయం చేయడం జరిగింది. తాజాగా సీనియర్ సినిమాటోగ్రఫర్ పి.దేవరాజ్ కీ ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు.

Chiranjeevi who gave huge financial support to the senior cameraman

దక్షిణాది సినిమా రంగంలో అనేక భాషలలో 300కు పైగా చిత్రాలకు పనిచేయడం జరిగింది. కొన్ని నెలల క్రితం మేజర్ ఆక్సిడెంట్ కి గురికావడంతో.. పి.దేవరాజ్ పరిస్థితి చాలా దయనీయంగా మారింది. సరిగ్గా నడవలేక మంచానికి పరిమితం కావడం జరిగింది. ఇటీవల ఆయన సుమన్ టీవీ కి ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. రోజు గడవడం చాలా కష్టంగా ఉంది. తినటానికి కూడా డబ్బులు లేవని ఇంటర్వ్యూలో తెలియజేశారు. చనిపోవాలని ఉంది అని ఆ ఇంటర్వ్యూలో కన్నీరు పెట్టుకోవడంతో ఈ విషయం చిరంజీవి దాక వెళ్ళటంతో వెంటనే స్పందించారు. సీనియర్ సినిమాటోగ్రఫర్ పి.దేవరాజ్ కీ చిరంజీవి స్వయంగా 5 లక్షల రూపాయలు చెక్ అందించడం జరిగింది. చిరంజీవి నటించిన పలు సినిమాలకు కూడా దేవరాజ్ పనిచేయడం జరిగింది. ఇదేవిధంగా సుమన్ టీవీలో ఒకప్పుడు తెలుగు చలనచిత్ర రంగంలో పాకీజా అనే పాత్ర వేసిన వాసుకి ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది.

Chiranjeevi who gave huge financial support to the senior cameraman

ఆ ఇంటర్వ్యూలో తాను చాలా ఆర్థికపరమైన కష్టాలు ఎదుర్కొంటున్నట్లు… తినటానికి కూడా ఏమీ లేదని యాంకర్ కి తెలియజేయడంతో.. ఇంటర్వ్యూ చూసినా మెగా బ్రదర్ నాగబాబు లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కూడా లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేయటంతో పాటు పలు సీరియల్స్ లో వేషం వచ్చేలా హామీ కూడా ఇవ్వటం జరిగింది అంట. దీంతో సొంత తమిళ ఇండస్ట్రీ సాయం చేయబోయిన గాని తెలుగు వాళ్ళు ఈ రీతిగా నన్ను ఆదుకోవడం.. నేను జీవితంలో మర్చిపోలేను అంటూ పాకీజా తన సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగిందంట. మెగాస్టార్ చిరంజీవి.. ఈ దిశగా చాలామంది సీనియర్ ఆర్టిస్టులను ఆదుకుంటూ తన వంతుగా సాయం చేస్తూ వస్తున్నారు.


Share

Related posts

Samantha : అయ్యో పాపం .. సమంత ఇంట్లో దొంగోడు .. కానీ అంతలోనే ట్విస్ట్ !

Ram

పూజా హెగ్డే అప్పుడు సమంత ని కామెంట్ చేస్తే శాకుంతలం తో ఇప్పుడు దెబ్బకొట్టి కసి తీర్చుకుంది ..!

GRK

సుకుమార్ కంటే త్రివిక్రమ్ తోపా ? త్రివిక్రమ్ కంటే సుకుమార్ తోపా ? ఆన్సర్ ఇదే ?

GRK