ఆ తమిళ హీరో తన సినిమా లో కావాలని మొండిగా వాదిస్తున్న చిరంజీవి ?

ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద ప్రాజెక్టులలో విజయ్ సేతుపతి సరికొత్త క్యారెక్టర్లు వేస్తూ విలన్ గా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. అతని పెర్ ఫార్మెన్స్ కి చాలామంది స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వడానికి ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తున్నారు. దీంతో ఇండస్ట్రీలో డిమాండ్ పెరగడంతో విజయ్ సేతుపతి రెమ్యూనరేషన్ ఒక్కసారిగా పెంచడం జరిగింది. ఇలాంటి తరుణంలో వస్తున్నా అవకాశాలు చాలావరకు తగ్గటం ప్రారంభించాయి. కానీ ఈ తమిళ హీరోని కావాలని మొండిగా చిరంజీవి తన సినిమాల్లో పెట్టుకోవడానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

Chiranjeevi Is A Universityపూర్తి విషయంలోకి వెళితే “లూసిఫర్” సినిమాని రామ్ చరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఓ కీలక క్యారెక్టర్ కి సంబంధించి డిస్కషన్ లో చెర్రీతో ఈ క్యారెక్టర్ కి నూటికి నూరుశాతం విజయ్ సేతుపతి సూటవుతాడని చెర్రీతో వాదించారట. దీంతో చెర్రీ కూడా అతన్నే తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటువంటి తరుణంలో ఈ పాత్ర ఏ విధంగా ఉంటుందో తెలియక పోయినా చిరంజీవి మాత్రం విజయ్ సేతుపతిని పట్టుబట్టి ఈ సినిమాలో పెట్టించటం వార్త ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.

 

ఇదిలా ఉండగా ప్రస్తుతం మెగాస్టార్ కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే సినిమా షూటింగ్ చేయడానికి రెడీ అవుతున్నారు. చాలా వరకు షూటింగ్ లో ప్రారంభమైన తరుణంలో వరుస ప్రాజెక్టులు లైన్ లో పెట్టిన చిరంజీవి “లూసిఫర్” సినిమాకి సంబంధించి డైరెక్టర్ గా వివి వినాయక్ ని తీసుకోవటంతో ఆ సినిమాకి సంబంధించి కొన్ని క్యారెక్టర్ల డిస్కషన్ లో తాజాగా విజయ్ సేతుపతి కి అవకాశం ఇచ్చినట్లు సమాచారం.