Bhola Shankar: తెలుగు చలనచిత్ర రంగంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జయపజయాలతో సంబంధం లేకుండా పవన్ సినిమాలు ఓపెనింగ్స్ ఉంటాయి. ఇండస్ట్రీలో ఏ హీరోకీ రాని రీతిలో పవన్ సినిమా లకీ కలెక్షన్స్ వస్తాయి. పవన్ ఏదైనా సినిమా వేడుకకు లేదా రాజకీయ వేడుకకు వచ్చాడు అంటే అభిమానులు తండోపతండాలుగా ఉంటారు. ఇండస్ట్రీలో అందరూ హీరోల అభిమానులు తీరు ఒకరకమైతే.. పవన్ అభిమానుల తీరు మరో రకం. ఇదిలా ఉంటే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న “భోళా శంకర్” సినిమాలో పవన్ కళ్యాణ్ అభిమానిగా కనిపించనున్నారట.
మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. తమన్నా హీరోయిన్ గా చేస్తోంది. ఓ స్పెషల్ పాత్రలో యాంకర్ శ్రీముఖి కనిపిస్తుంది. తమిళంలో అజిత్ నటించిన “వేదాళం”కి రీమేక్ గా “భోళా శంకర్” తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో పవన్ భూమిక నటించిన “ఖుషి”లో నడుము సీన్… శ్రీముఖితో చిరంజీవి చేయనున్నట్లు సమాచారం. చాలా కామెడీగా ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారట. అంతేకాదు అప్పట్లో గుణశేఖర్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన “చూడాలని ఉంది” సినిమాలో సూపర్ డూపర్ హిట్ సాంగ్ “రామ చిలకమ్మా” సాంగ్ నీ ఈ సినిమాలో రీమేక్ చేయనున్నారట.
ఏప్రిల్ 14 వ తారీకు ఈ సినిమా రిలీజ్ కానుంది. మార్చి నెల ఆఖర నుండి ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. చిరంజీవి ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో “వాల్తేరు వీరయ్య” సినిమాతో అద్భుతమైన విషయం అందుకున్నారు. ఇప్పుడు సమ్మర్ కానుకగా “భోళా శంకర్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మరి ఈ సినిమా ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.