NewsOrbit
Entertainment News సినిమా

Bholaa Shankar Trailer: యూట్యూబ్ నీ షేక్ చేస్తున్న చిరంజీవి “భోళా శంకర్” ట్రైలర్..!!

Advertisements
Share

Bholaa Shankar Trailer: మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమన్నా హీరోయిన్ గా తెరకెక్కిన “భోళా శంకర్” ఆగస్టు 11 వ తారీకు విడుదల కాబోతోంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెల పాత్రలో కీర్తి సురేష్ నటించింది. ఇదే సినిమాలో కుర్ర హీరో అక్కినేని సుశాంత్ కూడా కీలక పాత్ర పోషించారు. తమిళంలో అజిత్ హీరోగా నటించిన వేదాళం సినిమాకి రీమేక్ గా రాబోతోంది. అన్నా చెల్లెల సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన “భోళా శంకర్” ట్రైలర్ నేడు రిలీజ్ అయింది. చిరంజీవిని డైరెక్టర్ మెహర్ రమేష్ చాలా అద్భుతంగా చూపించారు.

Advertisements

Chiranjeevi's Bholaa Shankar trailer is shaking YouTube

స్టైలిష్ లుక్ లో చిరంజీవి అదిరిపోయే యాక్షన్ ఫైట్స్ చేస్తూనే మరోపక్క కామెడీ చేస్తూ.. అదరగొట్టే డైలాగులు వేశారు. ఈ సినిమాలో జబర్దస్త్ శీను తో పాటు యాంకర్ శ్రీముఖి.. కూడా కీలకపాత్రలు చేయడం జరిగింది. ఒకప్పుడు గ్యాంగ్ లీడర్ ఇంకా “శంకర్ దాదా” ఎంబిబిఎస్ టైంలో చేసిన కామెడీ టచ్ “భోళా శంకర్”లో కనిపిస్తోంది. ఇలా ఉంటే తాజాగా విడుదలైన ట్రైలర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది. దీంతో యూట్యూబ్ నీ షేక్ చేసేస్తోంది.

Advertisements

Chiranjeevi's Bholaa Shankar trailer is shaking YouTube

మెగా తుఫాన్ మొదలైంది అంటూ విడుదల చేసిన కొద్దిసేపటికే రెండు మిలియన్ల వ్యూస్ సాధించినట్లు సినిమా యూనిట్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ప్రస్తుతం యూట్యూబ్ లో “భోళా శంకర్” ట్రైలర్ ఇంకా ట్రెండింగ్ గా కొనసాగుతూ ఉంది. దీంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఏడాది ప్రారంభంలో వాల్తేరు వీరయ్య అంతకుముందు గాడ్ ఫాదర్ సినిమాలతో చిరంజీవి రెండు విజయాలు తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. “భోళా శంకర్” సినిమాతో హ్యాట్రిక్ విజయం సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ముఖ్యంగా “భోళా శంకర్” లో పవన్ కళ్యాణ్ అభిమానిగా చిరంజీవి కనిపించబోతున్నారు. ఈ క్రమంలో విడుదలైన ట్రైలర్ లో పవన్ మేనరిజంకి సంబంధించి కొన్ని హావభావాలు కూడా చిరంజీవి తన స్టైల్ లో చూపించటం జరిగింది.


Share
Advertisements

Related posts

సినిమా రివ్యూ : కీర్తి సురేష్ ‘పెంగ్విన్’

arun kanna

నా ప్రేమ‌ను పంపుతున్నా.. ఆ ఇద్ద‌రు హీరోయిన్ల కోసం విజ‌య్ దేవ‌ర‌కొండ‌ పోస్ట్

kavya N

Nivisha New Wallpapers

Gallery Desk