Chiranjeevi: ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఓటిటిల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. రకరకాల కార్యక్రమాలు మరియు వెబ్ సిరీస్, టాకీ షోలు ఆడియన్స్ నీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఆహాలో “అన్ స్టాపబుల్” టాకీషో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ఈ షోకీ మొదటి సీజన్ లో సినిమా సెలబ్రిటీలు రెండో సీజన్ లో సినిమా సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు రావటం జరిగింది. కాగా ఇప్పుడు ఇదే తరహాలో సోని లైవ్..ఓటిటిలో ఒకప్పటి పాప్ సింగర్ స్మిత హోస్ట్ చేస్తున్న ‘నిజం విత్ స్మిత’ టాక్ షో స్టార్ట్ చేయడం జరిగింది.
ఫిబ్రవరి 10వ తారీఖు మొదటి ఎపిసోడ్ లో మెగాస్టార్ చిరంజీవి రావడం జరిగింది. ఈ షోలో చిరంజీవి తన వ్యక్తిగత మరియు సినిమా కెరియర్ గురించి ఇంకా కుటుంబ సభ్యుల గురించి అనేక విషయాలు తెలియజేశారు. ఈ సందర్భంగా.. పవన్ రాజకీయ నేతగా లేదా సినిమా హీరోగా రెండిటిలో మీకు ఏ రకంగా నచ్చుతాడు అని చిరంజీవిని స్మిత ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు చిరంజీవి సమాధానం ఇస్తూ… చిన్ననాటి నుండి పవన ఆలోచనలు మరియు అతని యొక్క వ్యక్తిత్వం, ఇతరులకు ఏదైనా సాయం చేయాలన్న తపన బట్టి ఏదో ఒక రోజు రాజకీయంగా మంచి స్థాయిలో ఉంటాడు.
అయితే దానికోసమే ఒకానొక సమయంలో నక్సల్ లోకీ వెళ్లిపోతాడేమో అని భయమేసింది. చిన్ననాటి నుండి గన్ లతో బాగా ఆడుకునే వాడు. నేను ఏదైనా విదేశాలకు షూటింగ్లకు వెళ్తే అక్కడ గన్స్ దొరికే ప్రదేశాలకు సంబంధించి వివరాలు చెప్పి కుదిరితే కొనమనేవాడు. ఇంకా పవన్ కళ్యాణ్ కి అభిమానుల కంటే భక్తులు ఎక్కువ. అందరికీ ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ ది మరోరకం. అంతగా అభిమానులు తమ్ముడిని అభిమానిస్తారు. కాబట్టి కచ్చితంగా అతడు రాజకీయాల్లో ఉండటం అనేది మంచిది అనీ చిరంజీవి చెప్పుకొచ్చారు.