GodFather: దసరా పండుగ నాడు విడుదలైన “గాడ్ ఫాదర్” బ్లాక్ బస్టర్ విజయం సాధించటం తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో “ఆచార్య” అట్టర్ ఫ్లాప్ కావడంతో నిరాశ చెందిన మెగా ఫ్యాన్స్ ఆ తర్వాత “గాడ్ ఫాదర్” విజయంతో ఫుల్ జోష్ లో ఉన్నారు. చాలా పవర్ ఫుల్ పాత్రలో చిరంజీవిని.. దర్శకుడు మోహన్ రాజా అద్భుతంగా చూపించారని పొగుడుతున్నారు. విలన్ పాత్రలో సత్యదేవ్ కూడా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడని సినిమా చూసిన చాలామంది పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. సినిమా విజయం సాధించటంతో శనివారం “గాడ్ ఫాదర్” సినిమా యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో సినిమాలో నటించిన ప్రముఖులు ఇంకా చిరంజీవి దర్శకుడు మోహన్ రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ సినిమాలో అతిథి పాత్రలో నటించిన సల్మాన్ ఖాన్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు. హీరోకి తగ్గ రీతిలో పాత్రలో ఎవరి చేత చేయించాలి అని అనుకుంటున్నా సమయంలో మోహన్ రాజా చాలా సింపుల్ గా సల్మాన్ ఖాన్ పేరు చెప్పేశాడు. అయితే ఒప్పుకుంటాడా లేదా అని సందేహం ఉన్నాగాని ఈ బాధ్యతను చరణ్ తీసుకుని సల్మాన్ నీ ఒప్పించడం జరిగింది. అసలు ఎటువంటి స్టోరీ వినకుండా మామీద ప్రేమ చేత సల్మాన్ ఈ సినిమా చేశారు.
అంతేకాదు అంత పెద్ద యాక్టర్ నటించడంతో అందుకుగాను రెమ్యూన్ రేషన్ ఇవ్వాలని అనుకున్నాం. దీంతో ముంబాయిలో సల్మాన్ లోపల గదిలో ఉంటే ఆయన మేనేజర్ కి చెక్ లో పెద్ద అమౌంట్ రాసి నిర్మాత ఇవ్వగా.. గది లోపలికి చెక్ పట్టుకుని వచ్చిన మేనేజర్ ని సల్మాన్ పచ్చి బూతులు తిట్టారట. నేను కేవలం ఈ సినిమాని చిరు చరణ్ లపై ఉన్న ప్రేమ చేతనే ఒప్పుకున్నాను. వాళ్లపై నాకున్న ప్రేమకి కోట్లతో వెలగడతావా అని బండ బూతులు తిట్టారట. మా మీద సల్మాన్ కి ఉన్న ప్రేమకు ఇది నిదర్శనం అంటూ చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. అయినా కానీ చరణ్ ఊరుకోడు. సల్మాన్ వచ్చే బర్త్ డే నాడు చాలా పెద్ద సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చే దిశగా ప్లాన్ చేస్తున్నట్లు చిరంజీవి స్పష్టం చేశారు.