“ఆచార్య” నష్టపోయిన బయ్యర్ల విషయంలో చిరంజీవి, చరణ్ సంచలన నిర్ణయం..??

Share

కొరటాల శివ దర్శకత్వంలో ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన “ఆచార్య” దారుణంగా అట్టర్ ప్లాప్ కావడం తెలిసిందే. ఈ సినిమా రాకముందు వరకు కొరటాల శివ తీసిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. అయితే ఫస్ట్ టైం మెగా ఫ్యామిలీ హీరోలతో అది కూడా మెయిన్ హీరోలు చిరంజీవి, రామ్ చరణ్ లతో కొరటాల పనిచేయడంతో “ఆచార్య” పై అంచనాలు భారీ రేంజ్ లో ఏర్పడ్డాయి. తీరా సినిమా ఏప్రిల్ నెలలో విడుదలయ్యాక.. అట్టర్ ఫ్లాప్ అయ్యింది. పాండమిక్ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదలైన పెద్ద సినిమాలలో అత్యధిక పరాజయం పాలైన సినిమాగా “ఆచార్య” బొక్క బోర్లా పడింది.

కనీస కలెక్షన్ లు కూడా “ఆచార్య” రాబట లేకపోయింది. దీంతో గత కొద్ది రోజుల నుండి డైరెక్టర్ కొరటాల శివ కార్యాలయం వద్ద సినిమా డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా నిర్మాణ భాగస్వామ్యంలో కొరటాల శివ స్నేహితులు.. ఉండటంతో సినిమా పై నమ్మకంతో అంతకుముందే కొరటాల కొన్ని రైట్స్ అమ్మడం జరిగింది అంట. అయితే సినిమా దారుణంగా పరాజయం పాలు కావడంతో సదరు కొనుగోలుదారులు కొరటాల కార్యాలయం వద్ద ఆందోళనలు నిరసనలు తెలపడం జరిగింది.

దీంతో సినిమా నష్టం మేరకు నిర్మాతలైన స్నేహితులకు ఇంకా డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబిటర్లకు డబ్బులు చెల్లించాలని హైదరాబాదులో తన ఆస్తులు అమ్మడానికి రెడీ కావడం తెలిసిందే. ఇటువంటి తరుణంలో సినిమాలో హీరోలు చిరంజీవి మరియు రామ్ చరణ్ కొంతమేర నష్టం.. భర్తీ చేయడానికి ముందుకొచ్చినట్లు సమాచారం. విషయంలోకి వెళ్తే చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ కలిపి 20 కోట్ల మేర.. ఆచార్య నిర్మాణ భాగస్వామ్యంలో మ్యాట్నీ నిర్మాణ సంస్థకి వెనక్కి ఇచేయడం జరిగింది అని టాక్. దాదాపు చిరంజీవి అదే విధంగా చరణ్ సగం నష్టం భుజాలపై వేసుకుని.. కొరటాలని ఆదుకున్నట్లు టాక్. దీంతో మిగిలిన బ్యాలెన్స్ కొరటాల ఇవ్వనున్నట్లు సమాచారం.


Share

Recent Posts

కియారా అద్వానిపై దారుణంగా ట్రోలింగ్.. అంత తప్పు ఏం చేసింది..?

నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…

26 seconds ago

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

51 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

1 గంట ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago